Wife : మొగుడిని నడిరోడ్డుపై చితగ్గొట్టింది..!

meerut wife beaten husband on road

Wife : ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో (meerut)ఆసక్తికర ఘటన జరిగింది. నడి రోడ్డుపై ఒక మహిళ ఓ వ్యక్తిని చితకబాదింది. ఎవ్వరు ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. చితగ్గొట్టి వదిలేసింది. మహిళా పోలీసులు కూడా ఆమెను ఆపలేకపోయారు.

మీరట్ టౌన్ లోని ఓ రోడ్డుపై ఒక మహిళ (Wife )తన భర్తను చితగ్గొట్టింది. కారులో నుండి బయటకు లాగి.. గల్లా పట్టి అతనిపై దాడి చేసింది.

భార్య దెబ్బలకు షాకైన అతడు అక్కడి నుండి తప్పించుకోలేకపోయాడు. నడి రోడ్డుపై ఫైటింగ్ జరగడంతో ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది.

అటుగా వెళ్తున్న వాహనదారులు వచ్చి ఆపే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు పోలీసులు వచ్చి అష్టకష్టాలు పడి గొడవ ఆపి..వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

ఆమె తన భర్తను అంతలా ఎందుకు కొట్టిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వివాహేతర సంబంధం కారణమా లేకపోతే మరేదైనా ఉందా అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.

Read Also :