Tamil Nadu : తెల్లారితే ప్రేమ పెళ్లి.. కానీ రాత్రే ఘోరం..!

Dalit man hacked to death in Tamilnadu over intercaste relationship

Tamil Nadu : తమిళనాడులో ఘోరం జరిగింది. పదేళ్లకు పైగా ప్రేమించుకున్న జంటను దూరం చేసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు యువకుడి ప్రాణాలు తీసుకున్నారు.

దీనికి కారణం అబ్బాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడమే. అమ్మాయి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో పరువు సమస్యగా భావించిన వారు పెళ్లికి ఒప్పుకోలేదు. చివరకు యవకుడి ప్రాణం తీసుకున్నారు.

తమిళనాడులోని(Tamil Nadu) మైలదుత్తురై సమీపంలోని ఆదియమంగళానికి చెందిన వైరముత్తు టూవీలర్ మెకానిక్ గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెంది మాలినితో అతడు ప్రేమలో ఉన్నాడు. స్కూల్ లో చదువుకునే రోజుల నుండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.

అబ్బాయి తక్కువ కులం వాడు కావడంతో అమ్మాయి కుటుంబసభ్యులకు నచ్చలేదు.  చాలా సార్లు గొడవలు కూడా జరిగాయి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. దీంతో వాళ్ల పెళ్లి విషయంలో తాము అభ్యంతరం చెప్పబోమని పోలీసులకు కూడా చెప్పారు అమ్మాయి కుటుంబసభ్యులు.

Read Also :

తాను వైరముత్తుతో పాటే వెళ్తానని అమ్మాయి తెలిపింది. వారిద్దరు మేజర్లు కావడంతో ఈ నెల 14న అమ్మాయిని వైరముత్తుకు అప్పజెప్పారు. వారిద్దరు రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందామని నిశ్చయించుకున్నారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్ల కోసం ఈ నెల 15న మాలిని చెన్నైకి వెళ్లింది.

అదే రోజు రాత్రి వైరముత్తు షాపు నుండి ఇంటికి వెళ్తుండగా మాలిని అన్నాదమ్ములు కాపుగాసి కత్తులతో నరికారు.

తీవ్ర గాయాలపాలైన అతడిని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పరువుహత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. ధర్నాలు చేశాయి. దీంతో వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనలు విరమించారు.