Konda Surekha : మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో ఆమె కోర్టుకు వచ్చారు.
ఈ కేసులో ఇప్పటికే ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టాలని కోర్టు ఆదేశించింది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు చెప్పింది.
అయితే ఆ తర్వాత కొండా సురేఖ కోర్టు వాయిదాలకు హాజరుకావడం లేదు. వరుసగా మూడు సార్లు కోర్టు వాయిదాలకు ఆమె డుమ్మాకొట్టారు. దీంతో గత నెల 24న నాంపల్లి కోర్టు ఆమెపై సీరియస్ అయ్యింది.
దీంతో ఇవాళ ఆమె కోర్టుకు హాజరయ్యారు.
తాను కేటీఆర్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కోర్టుకు వివరించారు. కోర్టు ముందు తన వాదన వినిపించారు. తర్వాత ఈ కేసును ఈ నెల 30కి వాయిదా వేసింది.
..
Read Also :

