Brain Eating Amoeba : వణుకు పుట్టించే వార్త.. మెదడు తినేస్తున్న మహమ్మారి..!

Brain Eating Amoeba cases increasing in kerala

Brain Eating Amoeba :  దేశానికి మరో విపత్తు ముంచుకొచ్చింది. చైనాలో పుట్టి.. కేరళ ద్వారా  దేశం మొత్తాన్ని కరోనా ఆగం చేసినట్టు..ఇప్పుడు మరో మహమ్మారి అక్కడే పురుడుపోసుకుంది.

కరోనా శ్వాసవ్యవస్థపై  ప్రభావం చూపించి ఊపిరాడకుండా చేసి చంపింది. కానీ ఈ కొత్త మహమ్మారి (Brain Eating Amoeba)నేరుగా మెదడుకే వెళ్లి దాన్ని తినేస్తోంది. దీనిపేరు నైగ్లేరియా ఫౌలెరి(Naegleria fowleri). దీన్ని అమోబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్(amoebic meningoencephalitis) అంటారు.

What is Primary Amoebic Meningoencephalitis (PAM)? Brain Eating Amoeba

కేరళలో(kerala) ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 18 మంది ఈ మహమ్మారి భారిన పడి చనిపోయారు. మొత్తం 67 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అనధికారిక లెక్కల ప్రకారం ఇది మరింత ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ మహమ్మారి నీటి ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు. రీసెంట్ గా అక్కులమ్ (akkulam )అనే గ్రామంలోని స్విమ్మింగ్ పూల్ లోకి దిగిన యువకుడు ఈ మహమ్మారి భారిన పడ్డారు. దీంతో ఆ స్విమ్మింగ్ పూల్ ను మూసేశారు.

అలాగే అన్ని గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కలుషిత నీటిని ముట్టుకోవద్దని హెచ్చరించారు. వాటిని తాగొద్దని, మొహం కూడ కడుక్కోవద్దని చెప్పారు.

ఈ నైగ్లేరియా ఫౌలెరి ముక్కు ద్వారా నేరుగా మెదడులోకి వెళ్లి.. క్రమంగా మెదడు మొత్తాన్ని తినేస్తుంది. అందుకే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

బావులన్నింటిని క్లోరినేట్ చేస్తున్నారు. అలాగే ఇళ్లలోని నీటి ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

……….

Read Also :