Telangana

Disha paper : దిశ .. ఇంత చిన్న లాజిక్ ఎలా ..? బజారున పడేశావ్ కదా..!

ఇవDisha paper news back fired : తెలంగాణలోని వార్తపత్రికలన్నింటికి ఏదో అయ్యింది. మొన్నటి దాకా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మేము సైతం అంటూ దూసుకొచ్చిన పత్రికలు ఇప్పుడు అన్నీ తోకముడిచాయి. అధికారపక్షాన్ని ఆకాశానికెత్తే పనిలో బీజీగా ఉన్నాయి.

ఇక పోరాటమే తమ ఎజెండా.. ప్రశ్నించడమే తమ నినాదం అంటూ పుట్టుకొచ్చిన దిశ పత్రిక అనతికాలంలోనే మూడు నాలుగు రంగులు మార్చింది. కొద్దిరోజులు బీజేపీని, బండి సంజయ్ ని ఆకాశానికెత్తింది. ఆ వెంటనే రంగు మార్చి మూడు రంగుల జెండా పట్టింది. ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి పీక్స్ లో పబ్లిసిటీ ఇస్తోంది.

సరే.. ఆ పత్రికలో (Disha paper) పెట్టుబడులు పెట్టిన పెద్దవాళ్లు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో.? పదవులో, పనులో మనకు తెలియదు కానీ.. భజన చేయడం పచ్చిగా చెప్పాలంటే జోకడంలో మాకు మేమే సాటి అని ప్రతిరోజు నిరూపించుకుంటున్నారు. ఇది ఇవాళ్టి భజనలో ఒక భాగం.

ఇది దిశపత్రికలో వచ్చిన ఒక వార్త.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Disha paper news 1Disha paper news 2

అందుకే అతిగా భజన చేసేవాళ్లను నమ్మొద్దని చెబుతుంటారు. వీరి అతిభజన కూడా అలాగే అయ్యింది. గత సర్కారును నిందిస్తూ.. ప్రస్తుత సర్కారును ఆకాశానికి ఎత్తుతున్నామన్న భ్రమలో వీళ్లు ఓ పెద్ద తప్పిదం చేశారు. ప్రజాప్రతినిధులను, అధికారులను తీసుకెళ్లి బజార్లో నిలబెట్టారు.

ఈ వార్త సారాంశం ఏంటంటే.. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పుడు నార్మల్ ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ తమ ఫోన్లు ట్యాప్ చేస్తారేమోనని వాట్సాప్ లో, ఫేస్ టైమ్ లో సీక్రెట్ కాల్స్ మాట్లాడుకునేవాళ్లు అని రాసుకొచ్చారు.

అయితే.. ఇక్కడ నాది ఒక ప్రశ్న.

అంతా మంచిగానే ఉన్నప్పుడు, ఏ తప్పూ చేయనప్పుడు, లంగదందాలు చేయనప్పుడు సీక్రెట్ గా వాట్సాప్ లో, ఫేస్ టైమ్ లో ఫోన్లు మాట్లాడుకోవాల్సిన పనేంటి.? అంటే అంతా ఏవో తెరచాటు వ్యవహారాలు నడిపిస్తున్నారనే కదా.  అలాంటోళ్లను పట్టుకునేందుకు ఇంటలిజెన్స్ వాళ్లు ఫోన్లు ట్యాప్ చేస్తారనే భయంతోనే కదా. అంటే అప్పటి సర్కారు చేసింది మంచి పనే కదా. అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పుడు పనులు చేయకుండా కొంత వరకు నియంత్రించగలిగినట్టే కదా.

సరే.. వర్తమానంలోకి వద్దాం.

ఇప్పుడు అందరు నార్మల్ కాల్స్ లో ప్రశాంతంగా  మాట్లాడుకుంటున్నారంటే.. ఏమన్నట్టు.? దందాలు, సెటిల్మెంట్లు, ఇతరత్రా వ్యవహారాలు, తెరచాటు కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ గా నార్మల్ కాల్స్ లోనే అన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. వాటాలు పంచుకోవచ్చు. ప్రస్తుత సర్కారు ఏమీ అనదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించుకోవచ్చు… అని ఈ దిశ పత్రిక సర్టిఫై చేస్తోందా.?

నిజానికి తప్పు చేసినోడు, చేయాలనుకునేవాడు భయపడతాడు. మరి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ తప్పూ చేయనప్పుడు అప్పుడు ఎందుకు రహస్యంగా కాల్స్ మాట్లాడుకున్నారు.? ఇప్పుడు ఎందుకు నార్మల్ కాల్స్ లో మాట్లాడుకుంటున్నారు. అది కూడా కాస్త వివరంగా చెబితే బాగుంటుంది కదా “మూడురంగుల జెండా పట్టిన దిశ”.

కాంగ్రెస్ ప్రభుత్వానికి జాకీలుపెడుతున్నామనే భ్రమలో అందర్నీ గంపగుత్తగా దొంగల్నిచేసింది.

“రాజుగారు మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య మంచిది కాదు అనే కదా అర్థం”  పాపం. ఈ చిన్న లాజిక్ మిస్సే ఏదో బ్రహ్మపదార్థాన్ని వార్త రాసినట్టు బిల్డప్ ఇచ్చి సర్కారులో అందరి మీదా బురదజల్లేసింది.

ఇవి కూడా చదవండి