Bundh : దసరాకు ముందే తెలంగాణలో కాలేజీ విద్యార్థులకు సెలవులు రాబోతున్నాయి. రేపటి నుండి రాష్ట్రంలో కాలేజీలన్నీ మూతపడబోతున్నాయి(Bundh). ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలన్నీ మూతపడనున్నాయి.
ఫీజు రీయింబర్స్ మెంట్ (fee reimbursement ) బకాయిలు విడుదల చేయాలంటూ ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు సర్కారుకు పదే పదే విజ్ఞప్తి చేశాయి.
అయితే తమ దగ్గర రూపాయి లేదని.. ఇప్పుడు పైసా ఇచ్చేది లేదని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti vikramarka) చేతులెత్తేశారు.
Read Also : యోగా గురువుకు గట్టిగా ఆయిల్ పెట్టిన కిలేడీలు
చాలా రోజులుగా కాలేజీల యాజమాన్యాలు సర్కారు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కాలేజీలు బంద్ చేస్తామని హెచ్చరించినా సర్కారు లైట్ తీసుకుంది.
తాజా విజ్ఞప్తి పైనా సానుకూలంగా స్పందించకపోవడంతో రేపటి నుండి కాలేజీలు బంద్ చేయాలని కాలేజీ మేనేజ్ మెంట్ లు నిర్ణయించాయి.
దసరాకు ముందు రూ.1200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే.. డిసెంబర్ 31 ముందు మొత్తం పెండింగ్ బకాయిలు రిలీజ్ చేయాలన్నారు. ఇక 2025-26 బకాయిలు.. 2026 డిసెంబర్ 31 లోపు రిలీజ్ చేయాలని చెప్పారు. మొత్తం ఆరు డిమాండ్లతో లేఖ రిలీజ్ చేశారు
Read Also : ఈ అందం వెనక ఇంత కథ ఉందా..?
రాష్ట్రంలో దాదాపు రూ.10వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలున్నాయి. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి కొంత ఉండగా.. రేవంత్ సర్కారు(Revanth reddy) వచ్చాక.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో అన్నీ కలిసి తడిపి మోపెడయ్యింది.
ఫీజు రీయింబర్స్ మంట్ రాక.. కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల్లో చేరలేక… ఉన్నత విద్యాసంస్థల్లో చేరలేక సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది.
Read Also :
కొన్ని కాలేజీలు విద్యార్థుల నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేసుకుని సర్టిఫికేట్లు ఇస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా సర్కారు మాత్రం పైసా లేదంటూ చేతులెత్తేయడంతో అటు విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరిగింది.

