KTR : గద్వాల పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి సంచలన సవాల్ విసిరారు.
గద్వాల బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. “రేవంత్ రెడ్డి.. మొగోడివైతే.. దమ్ముంటే పార్టీ మారిన10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.
20 నెలల్లో మీరు చేసిన పాలన ఏంటో.. పదేళ్లలో మేం చేసింది ఏంటో ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకుందాం” అంటూ సవాల్ విసిరారు.
ఆనాడు .. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు 10 మందిని ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.
ఆ ఇంటి కాకిని ఈ ఇంటి మీద వాలనివ్వబోమని చెప్పిన ఆయన.. కాల్చిపారేస్తామని మాట్లాడిన ఆయన.. ఈ పది కాకులను ఏం చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.
3 నెలల్లోనో.. 9 నెలల్లోనో.. ఖచ్చితంగా గద్వాలలో బైఎలక్షన్ వస్తుందని కేటీఆర్ (KTR)జోస్యంచెప్పారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేను తుక్కుతుక్కుగా ఓడగొట్టాలని పిలుపునిచ్చారు.
గద్వాల బిడ్డకే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
అలాగే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కేడర్ సత్తా చూపెట్టాలని పిలుపునిచ్చారు. రైతుల యూరియా, యువకుల ఉద్యోగాలు అమ్ముకున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు.
Read Also : మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం..!
Read Also : ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?
ఒక్కో గ్రూప్ వన్ పోస్టును రూ.3 నుండి రూ.5 కోట్లకు అమ్ముకున్న దుర్మార్గ ప్రభుత్వం అని మండిపడ్డారు.

