Rajagopal Reddy : 25 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి.?

Rajagopal Reddy cope on revanth reddy government

Rajagopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి సర్కారుపై సొంత పార్టీలో తిరుగుబాటు తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తోంది.

కొద్దిరోజులుగా రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) నిరసన గళం వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్(congress) పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తనకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని పలుమార్లు బహిరంగానే విమర్శించారు. తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పుడు తన జోరు మరింత పెంచిన రాజగోపాల్ రెడ్డి.. ఏకంగా సర్కారును కూల్చేందుకు సైతం సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ లోని 25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy)ఇటీవలే రహస్యంగా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఒక రహస్య ప్రాంతంలో ఈ భేటీ జరిగినట్టుగా చెబుతున్నారు.

Rajagopal Reddy vs Revanth reddy

గతంలో సర్కారుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకున్న ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి  హాజరైనట్టుగా సమాచారం.

అయితే.. ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం ఆలస్యంగా రేవంత్ రెడ్డికి(revanth reddy) చేరినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఆందోళన పడుతున్నట్టు సమాచారం.

ఎమ్మెల్యేలతో భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ (Rahul gandhi)చేరిపోయారని అంటున్నారు. ఢిల్లీలోనే ఉన్న ఆయన.. పార్టీ పెద్దలను కలిసి రేవంత్ రెడ్డిపై  ఫిర్యాదుచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అంతేకాదు.. తన వెంట 25 మంది ఎమ్మెల్యేలున్నారని పార్టీ పెద్దల ముందు బలప్రదర్శన చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also :