BIG BREAKING : మిస్ వరల్డ్ మంటలు ఇంకా చల్లారడం లేదు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన మిల్లా మాగీ అనే కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు చేశారు.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. స్వదేశానికి వెళ్లాక ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పరువు తీసింది.
అయితే మిస్ వరల్డ్ (Miss world 2025)వేదికగా జరిగిన మరో సంఘటన ఇప్పుడు బయటపడింది.
మిస్ వరల్డ్ పోటీలను ఓ ప్రముఖ తెలుగు ఛానల్ తరుపున మహిళా జర్నలిస్టు కవర్ చేశారు. దీంతో పర్యాటక శాఖ అధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో టూరిజం శాఖలో(Telangana Tourism ) కీలక అధికారిని మార్చారు.
Read Also : ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?
కొత్తగా వచ్చిన అధికారి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణను చూసుకున్నారు. దీంతో సదరు మహిళా జర్నలిస్టుకు ఆ అధికారితో పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.
కానీ మిస్ వరల్డ్ పోటీలు ముగిసిన తర్వాత కొద్ది రోజులకే ఆ మహిళా జర్నలిస్టుకు టూరిజం శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం వచ్చింది. ఎలా వచ్చిందని ఆరా తీస్తే.. అక్కడే ఉన్న పెద్దసారు ఇప్పించారని ఆ శాఖలో ఉన్నవారు చెప్పారు.
కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉందని సమాచారం. కాని సడెన్ గా ఆ మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
Read Also : బర్రెలా ఉన్నావంటూ అనసూయపై తిట్ల వర్షం..!
రహస్యంగా ఎందుకు ఉంచారు.?
అయితే.. ఆమె ఆత్మహత్యాయత్నం అంశాన్ని చాలా రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. అయినా బయటకు రాకుండా మేనేజ్ చేసినట్టు సమాచారం. కానీ చివరకు ఆ విషయం బయటకు పొక్కింది.
దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణం ఎవరనే చర్చ మొదలైంది. ఆమెకు ఉద్యోగం ఇప్పించిన ఆ కీలక అధికారి వేధింపులే కారణమా.? లేకపోతే వేరే కారణం ఏదైనా ఉందా అన్న ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఇదే సమయంలో ఆమె వైవాహిక జీవితంలో కూడా కొన్నిసమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీల తర్వాత అవి మరింత ముదిరాయని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటుందని మరికొందరు అంటున్నారు.
Read Also: చింపుకుని మరీ చూపిస్తున్న స్రవంతి చొకారపు..!
అయితే.. అధికారి ప్రమేయం లేకపోతే.. రహస్యంగా ఉంచి.. ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అయితే.. మిస్ వరల్డ్ పోటీల తర్వాత ఆ మహిళా జర్నలిస్టు ఓ స్వచ్ఛంధ సంస్థను సైతం ప్రారంభించారని తెలుస్తోంది. ఆ సంస్థ ప్రారంభ కార్యక్రమానికి ఆ ఐఏఎస్ అధికారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారని అంటున్నారు.
స్వచ్చంధ సంస్థ ఏర్పాటులో కూడా ఆ అధికారే ఆమెకు అన్ని రకాలుగా సహకరించారని మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
అయితే ఇప్పుడు ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో ఇందులో ఎవరి పాత్ర ఉందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Read Also :

