Breaking News : కాసేపట్లో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్..!

breaking-news-telangana-election-commission-going-to-release-panchayat-elections-notification

Breaking News : కాసేపట్లో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాబోతోంది. 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టబోతోంది.

ఈ ప్రెస్ మీట్ లో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ సమావేశంలో వెల్లడికానున్నాయి.

అయితే.. మొదట ఏ ఎన్నికలు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికలు మొదట జరుగుతాయా.?

లేకపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.

ప్రభుత్వం మాత్రం పంచాయతీ ఎన్నికలకే మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది.

పంచాయతీ ఎన్నికలు.. పార్టీ గుర్తులతో జరగవు కాబట్టి.. తమకు లాభం జరుగుతుందని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ గుర్తుతో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళితే ప్రజా వ్యతిరేకత మరింత తీవ్రమై ఎదురుదెబ్బ తగులుతుందని సర్కారు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.

..

Read Also :