MLA Defection : కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన పదిఎమ్మెల్యేల అనర్హత అంశం త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 31 లోపు అనర్హతపై నిర్ణయం ప్రకటించాలని స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ ప్రక్రియలో వేగం పెరిగింది.
ఇవాళ్టి నుండి వారం రోజుల పాటు.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్(Gaddam prasad) క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. దీనికోసం అసెంబ్లీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలను, వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను నేటి నుండి అక్టోబర్ 6 వరకు విచారించనున్నారు.
ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు (MLA Defection)స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వారు కూడా సమాధానం ఇచ్చారు. కానీ వారి సమాధానంపై బీఆర్ఎస్ అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.
ఒక్కో రోజు నలుగురు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను గంటపాటు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇవాళ 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రకాష్ గౌడ్, ఆ తర్వాత 12 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కాలె యాదయ్యను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.
మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు గూడెం మహిపాల్ రెడ్డిని, 3 గంటల నుండి 4 గంటల వరకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాలున్నాయి.
రేపు బతుకమ్మ పండుగ కావడంతో.. రేపు గ్యాప్ ఇచ్చి మరో నలుగురిని అక్టోబర్ 1వ తేదీన స్పీకర్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.
రెండు రోజుల్లో 8 మంది క్రాస్ ఎగ్జామిన్ పూర్తవుతుంది. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలిచారా లేదా అన్నది తెలియడం లేదు.
ఒకవేళ వారిని పిలిస్తే పరిస్థితి ఏంటనేది చర్చ జరుగుతోంది. కడియం ఆల్రెడీ పార్టీ మారినట్టు ఒప్పుకున్నారు. దానం నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ గుర్తుపై పోటీ కూడా చేశారు.
ఇంత ఓపెన్ గా ఉన్నా కూడా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలిస్తే ఎలా అని బీఆర్ఎస్ అంటోంది.
అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు…
ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ నేపథ్యంలో.. నేటి నుండి అక్టోబర్ 6 వరకు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. కేవలం విచారణకు హాజరువుతున్న వారు తప్ప.. ఎవరికీ అసెంబ్లీలోకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అసెంబ్లీలోకి నో ఎంట్రీ అని చెప్పేశారు.

ఇక సిట్టింగ్ లకు మాత్రం ఎల్పీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతి ఉంది.
మీడియాను కూడా లోపలికి అనుమతించేది లేదని చెప్పారు. మీడియా పాయింట్ లో కూడా ఎవరూ మాట్లాడొద్దన్నారు.
..
Read Also :

