Balapur laddu : బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నది ఇతనే

balapur laddu

Balapur laddu : గణపతి నవరాత్రుల్లో అనేక చోట్ల లడ్డూ వేలం జరుగుతూ ఉంటుంది. కానీ బాలాపూర గణపతి లడ్డూకు చాలా ప్రత్యేకత ఉంటుంది.

బాలాపూర్ లడ్డూ (Balapur laddu)వేలం గురించి రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. గతేడాది ఈ లడ్డూను కొలను శంకర్ రెడ్డి రూ.30 లక్షలకు కొనుగోలు చేశారు.

దీంతో ఈ సారి లడ్డూ ఎంత ధర పలుకుతుందని అంతా ఆసక్తిగా చూశారు.

అయితే ఈ సారి లడ్డూ రూ.35 లక్షలు పలికింది. రూ. 1,116తో వేలం మొదలవగా రూ.35 లక్షలకు చేరుకుంది.

కర్మన్ ఘూట్ కు చెందిన లింగాల ధశరథ్ గౌడ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఈ లడ్డూ కోసం పోటీ పడుతున్నారు. కానీ ఆయనకు అవకాశం రాలేదు. దీంతో ఈ సారి సొంతం చేసుకున్నారు.

మొత్తం 38 మంది వేలంలో పాల్గొనగాదశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు.

lingala dasharath goud

Read Also :