Jagga Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీ చేసిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత చాలా పదవుల కోసం ప్రయత్నాలు చేసి ఊరుకుండిపోయారు. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఆయన భార్య నిర్మలకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఖచ్చితంగా తెలుస్తారని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి.
కానీ వారందరికి ఆయన (Jagga Reddy)షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తానుపోటీ చేయబోనని స్పష్టం చేశారు. పదేళ్లపాటు.. అంటే రెండు టర్మ్ లు తాను పోటీ చేయబోనని చెప్పారు. సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో ఈ విషయం స్పష్టం చేశారు.
అప్పటి దాకా నేను ఎన్నికల్లో పోటీ చేయను..
జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. pic.twitter.com/UfvVgsK16v
— PV NEWS (@pvnewstelugu) October 3, 2025
వచ్చే ఎన్నికల్లో తన భార్య నిర్మల జగ్గారెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపారు. తాను బ్యాక్ గ్రౌండ్ లో ఉంటానని అన్నారు. పదేండ్ల తర్వాతే పోటీ చేస్తానని చెప్పారు.
పదేళ్ల పాటు జగ్గారెడ్డి ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది.
తాను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినని చాలా సార్లు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశారని ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు ఎందుకు ఆయన సడెన్ గా పదేళ్ల పాటు పోటీ చేయబోనని చెబుతున్నారనేది సస్పెన్స్ గా మారింది.
..
Read Also :

