Sandeep Jha : కలెక్టర్ సందీప్ ఝా బదిలీ.. సిరిసిల్లలో సంబురాలు..!

siricilla collector sandeep kumar jha transferred

Sandeep Jha : కేరాఫ్ కాంట్రవర్సీగా ఉన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు (Sandeep Jha)బిగ్ షాక్ తగిలింది. వరుసగా కోర్టు చీవాట్లు పెట్టినా ఆయన తీరు మారలేదు. ఆయనకే కాదు.. సర్కారుకు అనేకసార్లు చీవాట్లు పెట్టినా తీరు మార్చుకోలేదు.

రీసెంట్ గా మరోసారి కోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. సిరిసిల్ల కలెక్టర్ గా హరితను(Haritha Ias) నియమించింది. రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించింది.

దీంతో సిరిసిల్ల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

సిరిసిల్లలో(siricilla) పోస్టింగ్ తీసుకున్నప్పటి నుండి సందీప్ కుమార్ ఝా వ్యవహారం కాంట్రవర్సీగా మారింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా ఆయన అక్కడ పనిచేశారు.

వారి దుకాణాలకు సీల్ వేయడం, చిన్న టీ కొట్టును కూడా  వదలకుండా దౌర్జన్యం చేశారు. ఇక కోర్టులను సైతం ధిక్కరించారు. కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తులు చెప్పినా పట్టించుకోలేదు.

దీంతో పదే పదే ఆయనకు కోర్టు చీవాట్లు పెట్టింది. రెండు మూడు నెలలకోసారి కోర్టుతో చీవాట్లు తినడం ఆయనకు ఆనవాయితీగా మారింది.

అయినా తీరు మార్చుకోకుండా  అదే పొగరు చూపించారు. చివరకు సెప్టెంబర్ 17 వేడుకలకు కూడా హాజరుకాలేదు. దీంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్… చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.

మరోవైపు.. జిల్లాలో కూడా కొందరు అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారనే ప్రచారం కూడా ఉంది. తన వర్గంగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంలో ఉన్నవారిపై విమర్శలు చేయించారని కూడా చెబుతున్నారు.

తాజాగా డీపీఆర్వో శ్రీధర్…. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను విమర్శిస్తూ ఓ కార్టూన్ అధికారుల గ్రూపులోనే షేర్ చేశారు. ఇది కాంట్రవర్సీ అయ్యి.. చివరకు ఆ అధికారిని సస్పెండ్ చేశారు.

ఆ డీపీఆర్వో కూడా కలెక్టర్ అండతోనే అలా చేశారని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు.

ఎట్టకేలకు ఆయనను జిల్లా నుండి పంపించేయడంతో అంతా సంతోష పడుతున్నారు.

Read Also :