APPLE : సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 సిరీస్..!

17 SERIES COMING SOON

APPLE : టెక్ దిగ్గజం యాపిల్ తన తదుపరి గ్లోబల్ ఈవెంట్ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 9న అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా “Awe dropping” అనే ట్యాగ్‌లైన్‌తో ఈవెంట్ జరగనుంది.

ఇక భారత్‌లో, యాపిల్ తన నాలుగో స్టోర్‌ను ప్రారంభిస్తోంది. సెప్టెంబర్ 4న పూణెలోని కొరేగావ్ పార్క్‌లో యాపిల్ స్టోర్ ప్రారంభం కానుంది. ఇది దేశంలో యాపిల్‌కు మరో మైలురాయి కానుందని సంస్థ తెలిపింది.

గత వారం ప్రకటించిన బెంగళూరులోని యాపిల్ హెబ్బాళ్ స్టోర్ (సెప్టెంబర్ 2న ప్రారంభం) తర్వాత, పూణే స్టోర్ ప్రారంభం అవుతోంది. నేషనల్ బర్డ్ అయిన నెమలి రెక్కల స్ఫూర్తితో రూపొందించిన ఆర్ట్‌వర్క్ ఈ రెండు స్టోర్ల ప్రత్యేకతగా నిలుస్తోంది.

 

Read Also :