Revanth Reddy idol : పెట్టిన తెల్లారే రేవంత్ రెడ్డి విగ్రహ నిమజ్జనం..!

Revanth reddy idol immersion

Revanth reddy idol : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవమానం జరిగింది. ఆయన ఆకృతిలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని తొలగించాలని పోలీసులు ఆదేశించారు.

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మెట్టు సాయికుమార్(mettu sai kumar).. ముఖ్యమంత్రిపై ప్రేమతో ఆయన ఆకృతిలో గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్, మెడలో ఆకుపచ్చ కండువాతో.. తలమాత్రం గణపతిది (Revanth reddy idol)పెట్టారు. గోషామహల్ నియోజకవర్గంలోని అఘాపురాలో ఈ విగ్రహం పెట్టారు.

Revanth reddy idol immersion 1

అయితే.. గణనాథుడిని అవమానించేలా ఉందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (rajasingh)సైతం దీనిపై ఫైర్ అయ్యారు.

రేవంత్ రెడ్డి రూపంలో గణనాథుడి(lord ganapathi విగ్రహం ఎలా పెడతారని మండిపడ్డారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

దీంతో రంగప్రవేశం చేసినపోలీసులు విగ్రహాన్ని తొలగించాలని మెట్టు సాయికుమార్ కు సూచించారు. ఆ విగ్రహ స్థానంలో మరో విగ్రహం పెట్టాలని కోరారు.

Read Also :