Kamareddy Scandal : వురే ఏంట్రా ఇది..? ఛీ.. ఛీ…!

kamareddy-scandal-gay-extortion-exposed

Kamareddy Scandal: కామారెడ్డిలో ఒక భయంకరమైన ముఠా బాగోతం బయటపడింది. ఈ ముఠా లక్ష్యం – పురుషులతో లైంగిక సంబంధాలకు ఆసక్తి ఉన్న పురుషులు(Gay relations).

సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని, చాటింగ్ లు చేసి మగవాళ్లే మగవాళ్లకు వల వేస్తున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ మీటింగ్ స్పాట్ అయిన ఇంటికి (Kamareddy Scandal)పిలుస్తున్నారు. వారితో సరసాలు కొనసాగిస్తున్నారు.

ఇదే సమయంలో.. మగాళ్లతో మగాళ్లు ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫొటోలు రహస్యంగా రికార్డ్ చేస్తున్నారు.

ఏమీ తెలియనట్టు సరసాలు ముగించి పంపించేస్తున్నారు. కానీ ఆ తర్వాత వారికి ఆ ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. అడిగినంత డబ్బు ఇస్తే సరే.. లేకపోతే వాటిని బయటపెడతామని బెదిరిస్తున్నారు. బంధువులకు పంపుతామని, సోషల్ మీడియాలో(social media) పెడతామని వేధిస్తున్నారు.

దీంతో చేసేదేం లేక.. పరువుపోతుందనే భయంతో చాలామంది లక్షలాది రూపాయలు చెల్లించినట్టు తెలుస్తోంది. కొందరు ప్రాణాలు కూడా తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఓ యువకుడు కూడా ఈ ముఠా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.

Read Also :

అయినా వేధింపులు ఆగకపోవడంతో మిగతా బాధితులు బయటకు వస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 50కి పైగా ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే బాధితులు కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే (Kamareddy Scandal) పరిమితం కాలేదని తెలుస్తోంది. ఆదిలాబాద్(Adilabad), మేడ్చల్(medchal), సిరిసిల్ల, మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందినవారు కూడా ఉన్నారని సమాచారం.

ఈ ముఠా చాలా సిస్టమాటిక్‌గా పని చేసింది. మొదట మగవారినే టార్గెట్ చేసింది. సోషల్ మీడియా వలతో వారిని ఇరుకున పెట్టింది. ప్రైవేట్ వీడియోలు ఆయుధంగా మార్చి డబ్బు పిండింది.

కొంతమంది బాధితులు ధైర్యం చేసి పోలీసులను సంప్రదించడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియా పరిచయాల విషయంలో మహిళలే కాదు.. మగవాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.