Mahra : దుబాయ్ యువరాణి షేక్ మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ (31) మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏడాది క్రితం మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె, ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు.
అమెరికన్ రాపర్ ఫ్రెంచ్ మోంటానా (41)తో కొంతకాలంగా మహ్రా ప్రేమలో ఉన్నారు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు రాపర్ ప్రతినిధులు ధృవీకరించారు. ఈ సంవత్సరం జూన్‌లో పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటికీ, ఇప్పటి వరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

మహ్రా కంటే వయసులో దాదాపు పదేళ్లు పెద్దవాడైన ఫ్రెంచ్ మోంటానాతో ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ, ఇరువురి కుటుంబాలు ఈ సంబంధంపై ఎంతో ఆనందంగా ఉన్నాయని తెలుస్తోంది.
Read Also :

