Physiotherapist : బొక్కల డాక్టర్ దగ్గరకు పోతున్నరా..? ఇది చెక్ చేయండి..!

Health ministry orders to Physiotherapists

Physiotherapist : ఎముకలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా.. డాక్టర్ల కంటే కూడా ఫిజియోథెరపిస్టులకే ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తాం. ఫిజియోథెరపీ ద్వారా చాలా వరకు ఎముకల సమస్యలను నయం చేసుకోవచ్చు.

అయితే.. అలాంటి ఫిజియోథెరపిస్టులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఇప్పటికే వరకు ఫిజియోథెరపిస్టులను కూడా డాక్టర్లు అనే పిలుస్తాం. వాళ్లు కూడా తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకుంటారు.

Read Also : మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం..!

అయితే.. ఇకపై డాక్టర్ అని పెట్టుకోవద్దని కేంద్రం ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Read Also : ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?

ఫిజియోథెరపిస్టులెవరూ(Physiotherapist) తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు లేఖ రాసింది. ఒకవేళ అలా పెట్టుకుంటే అంటే చట్ట విరుద్ధం అని.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

How to become a Sports Physiotherapist in India

ఫిజియోథెరపిస్టులకు పేరు ముందు పెట్టుకోవడానికి ఒక పదాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.

అయితే.. కొందరు ఫిజియోథెరపిస్టులు డాక్టర్ అని తమ పేరు ముందు పెట్టుకుని.. ఆర్థోపెడిక్ డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు.

వారికి ఫిజికల్ ఎక్సర్ సైజ్ ల గురించి తెలుస్తుంది. కానీ ఏ మెడిసిన్ రాయాలి.? సమస్య తీవ్రత ఎలాంటిది అనేది పూర్తిస్థాయి అవగాహన ఉండదు. అలాంటి సందర్భాల్లో పేషెంట్లు ఇబ్బుందుల పాలవుతారు.

అందుకే.. ఫిజియోథెరపిస్టుల పేరు ముందు డాక్టర్ అనే పదాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది.