KCR ON Kaleshwaram : కాళేశ్వరం రిపోర్ట్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

kcr sensational comments on kaleshwaram

KCR ON Kaleshwaram : కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో తేల్చుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు సన్నద్ధమవుతున్నారు.

హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో, ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్, హరీష్ రావు, ఇతర కీలక నాయకులు సమావేశమయ్యారు. కాళేశ్వరంపై (KCR ON Kaleshwaram) ప్రభుత్వ కుట్రలను అసెంబ్లీలోనే బహిర్గతం చేయాలని నిర్ణయించారు.

“అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం..!!” అని బీఆర్ఎస్ నాయకులు హితబోధించారు.

రేవంత్ రెడ్డి కోరుకున్నట్టుగానే అసెంబ్లీలో కాళేశ్వరం అంశం ఎజెండా కానుంది.

దీనిని ప్రజల ముందు సాక్ష్యాలతో వివరించాల్సిన బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు.

కేసీఆర్ మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు (KCR ON Kaleshwaram)రైతుల కోసం నిర్మించాం. ప్రజల ప్రయోజనాల కోసం చేసిన ప్రాజెక్టును రాజకీయ దురుద్దేశాలతో దోషిగా చూపించాలనుకోవడం అన్యాయం” అని అన్నారు.

హరీష్ రావు (Harish rao)కూడా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించేందుకు సిద్ధమవుతున్నారు. “ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పు జరగలేదు. ప్రతి రూపాయి ఖర్చుకు లెక్కలు ఉన్నాయి. అసెంబ్లీలోనే(telangana assembly monsoon session) వాస్తవాలు బయటపెడతాం” అని ఆయన సమీప నేతలతో చెప్పినట్లు సమాచారం.

kcr on kaleshwaram commission report

బీఆర్ఎస్ వర్గాల ప్రకారం, అసెంబ్లీలో ప్రభుత్వంపై సాక్ష్యాలతో దాడి చేయాలని వ్యూహరచన జరుగుతోంది.

కేంద్ర ఏజెన్సీల పాత్ర, రేవంత్ రెడ్డి వైఖరి, ప్రాజెక్టు సాంకేతిక అంశాలు అన్నీ చర్చకు రానున్నాయి.

ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ (congress)ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కేసీఆర్ సూచించారు.

“రైతుల ఆత్మగౌరవానికి కాళేశ్వరం ప్రతీక. దాన్ని చెరిపేయాలన్న కుట్రలను అసెంబ్లీలోనే ఛేదించాలి” అని ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతుండడంతో, ఈ అంశం ప్రధాన రాజకీయ దుమారం రేపే అవకాశముంది.

Read Also :