Deepika padukone : నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ (prabhas) హీరోగావచ్చిన కల్కి 2898 AD సినిమా మంచి విజయాన్ని సాధించింది. దేశమంతటా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రత్యేకమైన కథతో తీసిన ఈ సినిమా హాలీవుడ్ ను మించిపోయేలా తీశారు.
అయితే.. దీనికి త్వరలో సీక్వెల్ తీయబోతున్నారు. దీంతో అందులో హీరోయిన్ గా ఎవరు ఉండబోతున్నారన్న దానిపై చర్చ మొదలైంది. పాత వాళ్లే ఉంటారా.? కొత్త వాళ్లను తీసుకుంటారా అన్న చర్చ జరిగింది.
ఇందులో కూడా దీపికా పదుకునే(Deepika padukone) చేయబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయని టాక్ వచ్చింది.
కానీ తాజాగా వైజయంతి మూవీస్ ఒక సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది.
కల్కి సీక్వెల్ లో(kalki movie) దీపికా పదుకునే నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. “మేము జాగ్రత్తగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి భాగంలో దీపికా ఎంతో కష్టపడ్డారు. కానీ క్రియేటివ్‌గా మన భాగస్వామ్యం కొనసాగలేదు. కల్కి 2898 AD లాంటి సినిమా పూర్తి అంకితభావాని, సమయాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు మా శుభాకాంక్షలు” అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025
అయితే.. సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy vanga)కారణంగానే దీపికాను ఈ మూవీ నుండి తప్పించారని ప్రచారం జరుగుతోంది. గతంలో స్విరిట్ మూవీ విషయంలో దీపికా వర్సెస్ సందీ రెడ్డి వంగా గొడవ జరిగింది. స్పిరిట్ మూవీ స్టోరీని దీపికా లీక్ చేశారన్నట్టుగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎవరైనా స్టోరీ చెప్పినప్పుడు నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ నిబంధనలు పాటించాలి. అలా పాటించకుండా పబ్లిసిటీ కోసం మా కష్టాన్ని వృథా చేస్తారా..? సందీప్ రెడ్డి వంగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇది ఇటు టాలీవుడ్(tollywood) ను, అటు బాలీవుడ్(bollywood) ను షేక్ చేసింది.
ఆయన ఎక్కడా దీపికా పదుకునే పేరు తీసుకోకున్నా.. అవి ఆమెను ఉద్దేశించినవే అన్న చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరిగింది. అప్పటి నుండి ఇద్దర మధ్య దూరం మరింత పెరిగింది.
అదే కారణంతో ఇప్పుడు ఆమెను కావాలనే కల్కి సీక్వెల్ నుండి తప్పించారని అంటున్నారు. అయితే.. ఆమె కేవలం ఈ ఒక్కమూవీ నుండే తప్పుకున్నారా.? లేకపోతే మొత్తం టాలీవుడ్ కే గుడ్ బై చెప్పబోతున్నారా..? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
గతేడాది బిడ్డకు జన్మనిచ్చిన దీపికా.. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఈ టైంలో ఆమెకు సందీప్ రెడ్డి వంగా గట్టి షాక్ ఇచ్చారు.
Read Also :

