Rahul Gandhi : కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. ఖూనీ చేస్తున్న వారిని కాపాడుతున్నారని ఆరోపించారు.
ఓట్ చోరీ విషయంలో తాను చేసిన ఆరోపణలకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. 100 శాతం ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఫేక్ అప్లికేషన్లు ఫైల్ చేసి, ఫేక్ లాగిన్ ఐడీలతో ఓటర్ల పేర్లను డిలీట్ చేశారన్నారు.
ఈసీ ఉద్దేశపూర్వకంగా లక్షల ఓటర్ల పేర్లను(vote chori) తొలగించిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాల్లోనే ఓటర్ల పేర్లు తొలగించారని చెప్పారు. ఓట్ చోరీపై ఢిల్లీలో ఆయన మరోసారి ప్రజెంటేషన్ ఇచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేలాది సంఖ్యలో ఓట్లు లిస్టు నుండి తొలగించారని వివరించారు. సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేసి.. ప్లాన్ ప్రకారం ఓట్లు తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు.
కర్ణాటకలో(Karnataka assembly election) ఓట్లు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్ నెంటర్లు ఉపయోగించారని రాహుల్ గాంధీ వివరించారు. ఆ ఫోన్ నంబర్లు ఎవరివి..? వాటిని ఎవరు ఆపరేట్ చేశారు..? అని ఆయన ప్రశ్నించారు.
మైనార్టీలు, ఆదివాసీల ఓట్లే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేస్తున్నారన్నారు. మహారాష్ట్రలోని(Maharashtra) రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు తయారు చేశారన్నారు.
సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్లినట్టు తాము గుర్తించామన్నారు. ఓట్లు తొలగించేందుకు ఏకంగా వ్యవస్థనే(Election commission ) హైజాక్ చేశారని ఆరోపించారు. అధికారులకు తెలియకుండా లిస్ట్ నుంచి ఓట్లు ఎలా పోతాయని ప్రశ్నించారు.
ఓట్ల తొలగింపునకు సంబందించిన ఐడీలు తమకు ఇవ్వాలని ఓటర్లు అప్లికేషన్లు పెట్టుకున్నా ఎలక్షన్ కమిషన్ స్పందించడం లేదని రాహుల్ గాంధీ చెప్పారు.
..
Read Also :

