Swiggy : స్విగ్గీలో ఇంత మోసమా..? మీరు చెక్ చేసుకోండి..!

Swiggy charging extra price for food

Swiggy : ఒకప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లో వండుకుని తినేవాళ్లం. కానీ ఇప్పుడు అంత ఒపిక, తీరిక ఎవరికి ఉంటోంది చెప్పండి.

ఫోన్ చేయాలి. ఏదో ఒక యాప్ ఓపెన్ చేయాలి. అందులో ఫుడ్ ఆర్డర్ పెట్టేయాలి. ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్.

చాలామంది రేట్లు కూడా చూడకుండా బుక్ చేసేస్తారు. ఏదో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి,…. టకా టకా ఐటమ్స్ యాడ్ చేస్తారు. పేమెంట్ చేసేస్తారు. ఒక్కో ఐటంకి ఎంత పడింది.? రేటు ఎక్కువ వేశారా.? తక్కువ వేశారా.? అని కూడా చెక్ చేయరు.

Read Also :

ఫుడ్ డెలివరీ యాప్(food delivery app) లకు ఇదే వరంగా మారింది. దోపిడీకి దారులు తెరిచింది. కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతోంది.

తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి సరవణంపట్టిలోని ఒక హోటల్ నుండి స్విగ్గిలో(Swiggy) కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెడదామని ఓపెన్ చేసి రేట్లు చూస్తే కళ్లు తిరిగిపోయాయి.

దీంతో హోటల్ కు వెళ్లి అక్కడే ఫుడ్ తీసుకుని బిల్ తీసుకుని వచ్చాడు.

స్విగ్గిలో 10 పరోటాలు, ఒక చికెట్ 65, ఒక చికెన్ లాలీపాప్, 2 చికెన్ బిర్యానీ కార్డ్ లో యాడ్ చేశాడు. మొత్తం కలిపి 1473రూపాయలు అయ్యింది.

Swiggy charging extra price for food

మరి తనకు ఏమనిపించిందో నేరుగా అదే హోటల్ కు వెళ్లి ఫుడ్ తిన్నారు. అక్కడ కూడా యాజిటీజ్ గా ఇవే ఐటమ్స్ తీసుకున్నారు. వాటి మొత్తం రూ.810.

Swiggy charging extra price for food

స్విగ్గిలో అదే ఐటమ్స్ కి రూ.1473

నేరుగా హోటల్ కు పోతే రూ.810

అంటే రూ. 663 ఎక్కువ అయ్యాయి.

అంటే హోటల్ లో ఉన్న రేట్ల కంటే స్విగ్గిలో దాదాపుగా 80 శాతం అదనంగా బిల్లు వేశారు.

అతను ఏమైనా దూరంలో ఉన్నాడేమో అందుకే డెలివరీ చార్జీలు ఎక్కువ వేశారేమో అనుకోవచ్చు. అతను బుక్ చేసింది కేవలం 2 కిలోమీటర్ల దూరానికి మాత్రమే. అయినా స్విగ్గీ ఈ స్థాయిలో దోపిడీ చేసింది.

మనం ఆకలి మీద ఉండి.. హడావుడి ఫుడ్ బుక్ చేస్తే..  ఇదుగో ఇలా దోచుకుంది.

అందుకే ఇప్పటి నుండి స్విగ్గీలో ఆర్డర్ పెట్టే ముందు.. ఒరిజినల్ రేట్లను ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి.

డబ్బులు ఎవరికీ ఊరికే రావు.

Read Also :