ACB : కరెంట్ ఆఫీసర్ ఇంట్లో కట్టల గుట్టలు..!

ACB ARRESTED ADE AMBEDKAR

ACB : హైదరాబాద్ లో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. కొద్దిరోజుల క్రితమే ఒక మున్సిపల్ మహిళా అధికారి లంచం తీసుకుంటూ దొరికారు. ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారి అక్రమ సొమ్ముతో పట్టుబడ్డారు.

TSSPDCL లో ఇబ్రహీంబాగ్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అంబేద్కర్(ADE AMBEDKAR) పై చాలా రోజులుగా అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై నిఘా పెట్టిన అధికారులు ఇవాళ తెల్లవారుజామునే ఎటాక్ చేశారు.

ఆయన నివాసంతో పాటు.. బంధువుల ఇళ్లపై మొత్తం 15 చోట్ల ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నోట్ల కట్టలు పెద్ద మొత్తంలో బయటపడ్డాయి. అవి చూసి ఏసీబీ  అధికారులే షాక్ అయ్యారు.

ACB ARRESTED ADE AMBEDKAR 1

1కోట్ల 18 లక్షల రూపాయల నోట్ల  కట్టలు ఆయన ఇంట్లో దొరికాయి. అలాగే ఆయన ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు తిరగడం ఖాయం.

శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఐదంతస్తుల భవనం, అమ్తర్ కెమికల్స్ పేరుతో 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక కంపెనీ, హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియాలో 6 ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు.

ACB ARRESTED ADE AMBEDKAR
ACB ARRESTED ADE AMBEDKAR

అలాగే.. రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టు గుర్తించారు.

అక్రమ సొమ్ముతో పట్టుబడిన అధికారి అంబేద్కర్ కు బినామీలు  కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనను అరెస్ట్ చేశారు.

మహనీయుడు అంబేద్కర్ పేరు పెట్టుకుని ఈ అవినీతి పనులేంటని.. అంతా దుమ్మెత్తిపోస్తున్నారు.

Read Also :