Sarees : రేవంత్ సర్కారు ఆడబిడ్డలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. బతుకమ్మ పండుగ రోజున ఈ చీరలు పంపిణీ చేయబోతున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చీరెలు(Bathukamma sarees) ఇచ్చేది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక వాటికి బ్రేకులువేసింది.
మంచి నాణ్యత ఉన్న చీరెలు.. ఒక్కొక్కరికి రెండేసి ఇస్తామని చెప్పారు. కానీ పోయినేడాది బతుకమ్మ పండుగకు ఇవ్వలేదు. ఈ సారి ఇస్తామని చెబుతున్నారు.
‘రేవంతన్న కానుక(Revanthanna kanuka)’ పేరుతో ఈ చీరెలు ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నారు. ఆధార్ కార్డ్ చూపిస్తే గతంలో ఒక చీర ఇచ్చేవారు. ఇప్పుడు ఆధార్ కార్డు చూపిస్తే రెండు చీరలు ఇవ్వబోతున్నారు.
అయితే.. అందులోనూ ఓ కండీషన్ పెట్టారు. ఈ సారి కేవలం డ్వాక్రా మహిళలకే చీరెలు ఇవ్వనున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా లేకపోతే బతుకమ్మ చీరెలు అందవు.
దీనిపై మహిళలు జోకులేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు అంటేనే కండీషన్ల సర్కారు.. కండీషన్లు లేకుండా ఏ స్కీం అమలు చేయరని జోకులేస్తున్నారు.
మహిళలందరికి రెండేసి చీరెలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి.. ఇప్పుడు కేవలం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నవారికే అని కండీషన్ పెట్టడంపై మండిపడుతున్నారు.
..
Read Also :

