HMDA Plots : డబ్బుల కోసం, అప్పుల కోసం అర్రులు చాస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. భూములు అమ్మి ఖజానా నింపాలని సర్కారు చూస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ సర్కారు భూములను అమ్మేస్తోంది. అయితే.. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన భూముల వేలంలో సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
హైదరాబాద్లో మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ బాచుపల్లిలో ప్లాట్ల వేలం నిర్వహించింది. అలాగే తుర్కయాంజల్ లోనూ వేలం నిర్వహించింది.
రెండు చోట్ల నిర్వహించిన వేలంలో సర్కారు భారీ షాక్ తగిలింది. తుర్కయాంజల్ లో ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోకపోవడంతో HMDA తలపట్టుకుంది.
బాచుపల్లిలో 70 ప్లాట్లను (HMDA Plots)వేలం వేశారు. గజానికి రూ.70,000 చొప్పున ధర నిర్ణయించారు. కానీ ఒక్క కొనుగోలుదారుడు కూడా ముందుకు రాలేదు. ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోలేదు. దీంతో అధికారులకు తలపట్టుకున్నారు.
గతంలో హైదరాబాద్ లో భారీగా ధర పెట్టిన హాట్ కేకులా అమ్ముడైన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు గజానికి రూ.70,000 పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ధర ఎక్కువగా ఉందని చాలామంది వెనక్కి తగ్గినట్టుగా సమాచారం.
ఇక తుర్కయాంజల్ లో 12 ప్లాట్లు వేలానికి పెట్టారు. ఇందులో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మిగతావాటిపై ఎవరూ ఆసక్తి చూపించలేదు.
ఒకేసారి రెండు చోట్లా ప్లాట్ల వేలంలో ఎదురుదెబ్బ తగలడంతో సర్కారు పెద్దలు తలపట్టుకుంటున్నారు. ఖజానా నింపుకోవడానికి ఇతర మార్గాలు వెతుకుతున్నారు.
అయితే.. గతంలో భారీ ధరపెట్టినా.. ఎగబడి కొన్న రియల్ వ్యాపారులు.. ఇప్పుడు ఎందుకు ఆసక్తి చూపడం లేదనేది చర్చనీయాంశంగా మారింది.
..
Read Also :

