Metro Rail : హైదరాబాద్ మెట్రో ఆగిపోతుందా..? ఫ్రీ బస్సు దెబ్బ..?

తమ నష్టాన్ని పూడ్చే ఏర్పాట్లు చేయాలని కోరింది. ఫ్రీ బస్సు ప్రకటించాక మెట్రోలో ప్రయాణికుల సంస్థ కొంత మేర తగ్గినట్టుగా తెలుస్తోంది.

Metro Rail : హైదరాబాద్ లో మెట్రో రైలు ట్రాఫిక్ సమస్యలను చాలా వరకు తీర్చింది. ఆఫీసులకు వెళ్లేవారు సొంత వాహనంలో ట్రాఫిక్ పడే ఇబ్బందులకు బ్రేక్ వేసింది. చల్లచల్లగా, పొల్యూషన్ ఫ్రీగా జర్నీ చేసే అవకాశం కల్పించింది.

దీనిని ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తోంది.

కానీ చాలా రోజులుగా ఎల్ అండ్ టీ సంస్థ తప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మెట్రో (Metro rail) నిర్వహణ చాలా భారం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

తమ నష్టాన్ని పూడ్చే ఏర్పాట్లు చేయాలని కోరింది. ఫ్రీ బస్సు ప్రకటించాక మెట్రోలో ప్రయాణికుల సంస్థ కొంత మేర తగ్గినట్టుగా తెలుస్తోంది.

వర్షాలు పడినప్పుడు పెద్ద ఎత్తున రష్ ఉంటోంది. కానీ మిగతా రోజుల్లో మాత్రం గతంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య తగ్గిందని సమాచారం.

దీంతో మెట్రో నిర్వహణ భారం అవుతోందని ఎల్ అండ్ టీ L&T సంస్థ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే దీనిని నిర్వహించాలని కోరుతోంది. లేదంటే ప్రత్యేకంగా తమకు నిధులు కేటాయించాలని కోరింది.

వరుస నష్టాలతో.. ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని తెలిపింది. లీజులు, యాడ్స్ ద్వారా వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని తెలిపింది. ప్రభుత్వాలు నిధులిస్తే తప్పా.. తాము సంస్థను నడపలేమని తేల్చిచెప్పింది.

Read Also :