Komatireddy Rajagopal reddy : అన్నపై, సీఎంపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

breaking news-batukamma

Komatireddy Rajagopal reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలనవ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తీరుపై ఆయన కొద్దిరోజులుగా  తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అప్పటి నుండి రాజగోపాల్ రెడ్డి(komatireddy rajagopal reddy) పార్టీకి దూరంగానే ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకాలేదు. దానికి ముందు కూడా ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. డిజిటల్ మీడియాపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

అలాగే మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతా ఆయన ఇష్టమేనా అని మండిపడ్డారు.

ఇప్పుడు ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పదవుల కోసం లాలూచీ పడే వ్యక్తిని కాదన్నారు. తనకు పదవి ఇవ్వమని రేవంత్ రెడ్డి(revanth reddy) దగ్గరకు పోయి బతిలాడుకునే మనిషిని కాదని చెప్పారు.

Read Also :

ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు. నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాటం చేయడానికి కూడా వెనకడుగు వేసేది లేదన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసి తీరుతానని అన్నారు.

అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇవి అన్న వెంకటరెడ్డిని ఉద్దేశించి చేసినవేనా అన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.

ఇటీవల రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy venkatreddy)చాలా దగ్గరయ్యారని ప్రచారం జరుగుతోంది. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టిన ఆయన.. ఇప్పుడు పొగుడుతూ మాట్లాడుతున్నారు.

ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.