MGBS : ఎంజీబీఎస్ బంద్.. బస్సులు ఎక్కడి నుండి నడుస్తాయంటే..!

MGBS bus satation closed buses diverted

MGBS : ఎగున ఉన్న జంట జలాశయాల నుండి భారీగా నీటిని విడుదల చేయడంతో మూసీ నది పోటెత్తుతోంది. ఫలితంగా మూసీ నదిమధ్యలో ఉన్న ఎంజీబీఎస్ నీట మునిగింది.

భారీగా వరద నీరు బస్టాండ్ లోకి చేరింది. ఎంజీబీఎస్ నుండే వరద ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్ ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ  సజ్జనార్ ప్రకటించారు.

అయితే.. నిన్నటి నుండి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు రావడంతో విద్యార్థులు పెద్దఎత్తున ఎంజీబీఎస్ కు వస్తున్నారు. వారందరూ రాత్రి వరదలో చిక్కుకున్నారు.

పోలీసుల సాయంతో విద్యార్థులను, ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు.

అయితే.. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా బస్సులను ఇతర ప్రాంతాల నుండి నడిపిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

ప్రయాణీకులెవరూ ఎంజీబీఎస్ కు రావొద్దని తెలిపారు. వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్ర‌దించాల‌ని సూచించారు.

  • ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే స‌ర్వీసులు జేబీఎస్ నుంచి న‌డుస్తున్నాయి.
  • వరంగల్, హన్మకొండ వైపున‌కు వెళ్లేవి ఉప్ప‌ల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి.
  • సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ, విజ‌య‌వాడ వైపున‌కు బ‌స్సులు ఎల్బీన‌గ‌ర్ నుంచి న‌డుస్తున్నాయి.
  • మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, క‌ర్నూల్, బెంగ‌ళూరు వైపున‌కు వెళ్లే స‌ర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.

Read Also :