Mallikarjun kharge : రైతులపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంతూరు కర్నాటకలోని కలబుర్గి(kalaburgi) నుండి కొందరు రైతులు కలిసేందుకు వచ్చారు.
ఇటీవల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని తమ గోడు చెప్పుకునేందుకు వారు(farmers) వచ్చారు. దెబ్బతిన్న పంటను కూడా తీసుకొచ్చి చూపించారు.
అయితే.. వారిపై ఆయన సీరియస్ అయ్యారు. “ఈ కంది పంటను పట్టుకొచ్చి పాడైందని నాకు చూపిస్తున్నారా..? మీది ఎంత పంట పాడైంది..? మీది నాలుగు ఎకరాలు కావొచ్చు.. నాది 40 ఎకరాలు పాడైపోయింది. పబ్లిసిటీ కోసం ఇలా నా దగ్గరకు పంట తీసుకుని రాకండి. పోయి మోడీ, షాకు చెప్పండి.”
రైతులపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
తనను కలిసేందుకు ఇంటికి వచ్చిన రైతులపై ఖర్గే సీరియస్..
ఈ కంది పంటను పట్టుకొచ్చి పాడైందని నాకు చూపిస్తున్నారా..?
మీది ఎంత పంట పాడైంది..?
మీది నాలుగు ఎకరాలు కావొచ్చు.. నాది 40 ఎకరాలు పాడైపోయింది.
పబ్లిసిటీ… pic.twitter.com/ZdzQInoOyB
— Prabhakar Venavanka (@Prabhavenavanka) September 8, 2025
అంటూ వారిపై మల్లికార్జున ఖర్గే (Mallikarjun kharge)అసహనం వ్యక్తంచేశారు. దీంతో ఆ రైతులు ఉసూరుమంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.
జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తమను ఆదుకుంటాడని వస్తే.. ఇలా మాట్లాడటం ఏంటని వారు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
Read Also :

