BREAKING NEWS : తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరూ ఊహించని పరిణామాలు జరగబోతున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ప్రభుత్వంలో కీలక మార్పులు జరగబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతలు సైతం దీనిపై గుసగుసలాడుకుంటున్నారు.
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డిని చాలా టెన్షన్ పెడుతున్నాయట. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఆయన ఉన్నారని సమాచారం.
మొన్న ఢిల్లీ వెళ్లినప్పుడు కేసీఆర్(KCR) ఫ్యామిలీ టార్గెట్ గా ఆయన విమర్శలకు కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. ప్రతీసారి ఎక్కువగా కేసీఆర్ ను టార్గెట్ చేసే రేవంత్ రెడ్డి.. తాజా ఢిల్లీ పర్యటనలో కవిత ఇష్యూపై మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు చేశారు.
మరోవైపు.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే.. త్వరలో కేటీఆర్(KTR) అరెస్ట్..!, కేటీఆర్ అరెస్ట్ కు ముహూర్తం ఫిక్స్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఇప్పించిన లీకులేనని అంటున్నారు.
మరి ఇలా ఎందుకు చేశారు.?
దీనికి చాలా పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. రెండేళ్లు కూడా నిండకముందే ప్రజలు తిరగబడుతున్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చి నెత్తిన పడింది.
ఆ తర్వాత.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. వేటు పడితే మళ్లీ ఉప ఎన్నిక వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బై ఎలక్షన్ లో ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు.
సర్వేలు అదే చెబుతున్నాయి. సెఫాలజిస్టులు కూడా అదే చెబుతున్నారు. దానికి అనేక కారణాలు కూడా చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ కు చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.
Read Also :
- రేవంత్ రెడ్డి ఇంత మోసం చేస్తవనుకోలే.. డీఎస్పీ నళిని మరణ వాంగ్మూలం
- కాంగ్రెస్ సర్కారు మూడేండ్లే.. కాడి ఎత్తేసిన ముఖ్యమంత్రి మంత్రులు..!
- తొక్కుకుంటూ పోతా.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ లో(jubilee hills bypoll ) ఇప్పటి వరకు చాలా మంది సర్వేలు చేయగా.. మెజార్టీ సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. దీంతో రేవంత్ రెడ్డికి కొత్త టెన్షన్ పట్టుకుందట.
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రేవంత్ రెడ్డి(Revanth reddy) ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు చాలా హామీలు ఇచ్చి వచ్చారట. 10 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు. మరో 20 మంది దాకా త్వరలో వస్తారని చెప్పారట. కానీ జంపింగ్ ఎపిసోడ్ 10 మంది దగ్గరే ఆగిపోయింది. వాళ్లు కూడ అవకాశం ఇస్తే రివర్స్ జంపింగ్ చేసికారులోకి వద్దామని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
దీంతో ఢిల్లీ పెద్దలు (Rahul gandhi)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. మీరు చెప్పినవన్నీ ఉత్త ముచ్చట్లే అయ్యాయని క్లాస్ పీకారని అంటున్నారు. “వాళ్లు ఎలాగూ రాలేదు. కనీసం ఇప్పుడు వస్తున్న ఉప ఎన్నికల్లో అయినా అన్ని సీట్లు గెలుచుకుని రండి.. లేకపోతే మీ పదవి తీసేసి వేరేవాళ్లకు ఇస్తామని..” హెచ్చరించినట్టుగా ప్రచారం జరుగుతోంది.
బీజేపీకి మరింత దగ్గరయ్యారా.?
కానీ.. ఓ వైపు సర్వే ఫలితాలు చూస్తేనేమో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు ఢిల్లీ నుండి మాత్రం ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తుండటంతో ఏం చేయాలో తెలియక రేవంత్ రెడ్డి తలపట్టుకుంటున్నారట.
అందుకే బై ఎలక్షన్ నుండి, ప్రజా సమస్యల నుండి అటెన్షన్ డైవర్షన్ కోసమే.. కేటీఆర్ అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ మొదలు పెట్టారని తెలుస్తోంది.
సొంత పార్టీ పెద్దల ప్రెజర్ ఎక్కువ కావడంతో.. ఈ మధ్య బీజేపీకి రేవంత్ రెడ్డి మరింత దగ్గరవుతున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందుకే ఢిల్లీ వెళితే.. ఇప్పటికీ సొంత పార్టీ పెద్దల అపాయింట్మెంట్ దొరకకున్నా.. బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ లు, ఆశీస్సులు దొరుకుతున్నాయని అంటున్నారు.
అయితే ఢిల్లీ నుండి రేవంత్ పై ప్రెజర్ పెరగడంతో.. సీఎం సీటుపై కన్నేసిన పాత కాంగ్రెస్ నాయకులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారట. తమకు అవకాశం రాబోతోందనే ఆనందంలో ఉన్నారట.

