Kaleshwaram : రోజు రోజుకు పెరిగిపోతున్న హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గోదావరి జలాలను హైదరాబాద్ కు తీసుకువస్తోంది.
దీనికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 20 టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ పనులు మొదలుపెట్టబోతున్నారు.
అయితే.. ఏ కాళేశ్వరం ప్రాజెక్టు అయితే కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రచారం చేశారో.. అదే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram) నుండి నీటిని తీసుకురాబోతున్నారు.
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ (mallannasagar)రిజర్వాయర్ నుండి 20 టీఎంసీల నీరు తీసుకురాబోతున్నారు.
దీంతో రేవంత్ రెడ్డి సర్కారుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ప్రకృతి ఒక విచిత్రమైన న్యాయం చేసి చూపిస్తుంది అని నాయిని అనురాగ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
There’s a strange justice in nature. The same mouths that mocked #Kaleshwaram will now drink water from it. The same project will flow into Musi, bringing it back to life
Congress govt is set to use 20 TMC from #MallannaSagar of Kaleshwaram, 2.5 TMC for Musi rejuvenation & 17.5… pic.twitter.com/R1qaSW79Xj
— Nayini Anurag Reddy (@NAR_Handle) September 7, 2025
“కాళేశ్వరం ప్రచారం చేసినవాళ్లే.. ఇప్పుడు దాని ద్వారా నీటిని తీసుకురాబోతున్నారని అన్నారు. కాళేశ్వరం గురించి ఎన్ని అబద్దాలు చెప్పినా.. వాటన్నింటిని పక్కకు తోసేసి అది చరిత్రలో అత్యున్నతమైన స్థానంలో నిలబడుతుంది. “ఇది రాజకీయాలకు అతీమైన విజన్”. తెలంగాణకు జీవనాడి.” అంటూ రాసుకొచ్చారు.
Read Also :
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!
- మొగుడిని వేసేసి మామూలు పర్ఫార్మెన్స్ కాదు
Read Also :

