Revanth reddy song : కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ప్రతీ అస్త్రాన్ని వాడుతోంది బీఆర్ఎస్. గతంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఎలాగైతే బీఆర్ఎస్ పై ఎటాక్ చేశారో.. ఇప్పుడు అలాగే బదులిస్తోంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలులో ఘోరంగా విఫలమైంది.
ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలపై రకరకాల పాటలు, అడ్వర్టైట్ మెంట్లు తయారు చేసింది. వాటితో ప్రజలను ఆకర్షించింది.
కానీ ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేసింది. ప్రశ్నిస్తే నిధులు లేవని చెబుతోంది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఓ పాటను రిలీజ్ చేసింది.
“వవ్వారే.. మావోనికి..వవ్వారే రేవంతుకు వచ్చిందట ఓ కల..” అంటూ మొదలయ్యే పాటలో కాంగ్రెస్ ఇచ్చి అమలు చేయని హామీల గురించి వివరించారు.
Read Also :

