KTR : బండి సంజయ్‌, టీవీ ఛానళ్లపై కేటీఆర్ కేసు.. కారణం ఇదే.!

breaking news-batukamma

KTR  : కేంద్రమంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. రూ.10 కోట్లకు దావా వేశారు.

కొద్దిరోజుల క్రితం ఫోన్ టాపింగ్ ఇష్యూలో కేటీఆర్(KTR) పై బండి సంజయ్(bandi sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ను దుర్వినియోగం చేశారని, ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ ఫాంలపై కూడా పరువునష్టం దావా వేశారు. తప్పుడు వార్తలు.. నిరాధారమైన వార్తలను ప్రచురించినందుకు, ప్రసారం చేసినందుకు ఈ కేసు వేశారు.

తన పరువు నష్టం కలిగించే విధంగా సమాచారాన్ని ఆయా ప్లాట్ ఫాంల నుండి తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Alsoo :

ఆగస్ట్ 8న ఆయన చేసిన వ్యాఖ్యలు ఏబీఎన్ తెలుగు, ఎన్టీవీ, టీవీ5, వీ6, ఏఎన్ఎన్ తెలుగు వంటి ఛానెళ్లు ప్రసారం చేశాయన్నారు. ఇండియా టుడే, ఎన్డీటీవీ, డెక్కన్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి డిజిటల్ ప్లాట్ ఫాంలు, ఎక్స్, యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ విపరీతంగా ప్రచారం చేశారన్నారు.

బండి సంజయ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే.. భవిష్యత్తులో కూడా నిందితులు.. తనకు పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కేటీఆర్ కోరారు.