Trump : బీటెక్ అయిపోగానే పిల్లలను అమెరికా ఫ్లైట్ ఎక్కించడం ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయింది. పిల్లలు అమెరికాలో ఉన్నారన చెప్పుకోకపోతే అదొక ఇన్సల్ట్ గా ఫీలవుతున్నారు తల్లిదండ్రులు.
అక్కడికి వెళ్లాక స్టోర్లలో పనిచేసినా ఫర్లేదు కానీ.. అమెరికా అయితే పంపిస్తున్నారు. అప్పో సొప్పో చేసి అమెరికా విమానం ఎక్కిస్తే వాళ్లే అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ సంపాదించుకుంటారని అనుకుంటున్నారు. చాలా ఏళ్లుగా ఇదే నడుస్తోంది.
కానీ అలాంటి వాళ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump)షాక్ ఇచ్చారు. చదువుకోవడానికి వచ్చి పార్ట్ టైమ్ జాబ్ చేసినా.. వేరే సైడ్ ఇన్కం సోర్సులు ఉన్నా దేశం నుంచి వెళ్లగొడుతున్నారు. ఇప్పటికే 6 వేల మందిని అమెరికా నుంచి బయటకు పంపించేశారు.
H1B, F1 వీసాలతో వచ్చి పార్ట్ టైం జాబ్ లు చేస్తున్నవారిపై అమెరికా అధికారులు (USA) ఫోకస్ పెట్టారు. అలాంటి వారిని వెతికి పట్టుకుని బయటకు గెంటేస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు దొరకడం లేదనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు.
ఇలా అక్రమంగా వేరే ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మందిని అమెరికా(America) నుండి బయటకు నెట్టేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే సరైన డాక్యుమెంట్లు లేని వేలాది మందిని వెళ్లగొట్టారు. ఇప్పుడు వీరి వెంట పడ్డారు. పూర్తి సమాచారం తెప్పించుకుని ఇమ్మిగ్రేషన్ దగ్గరే ఝలక్ ఇస్తున్నారు.
దేశంలోకి అడుగుపెట్టే ముందే.. ఇమ్మిగ్రేషన్ దగ్గరే వారిని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు.? ఏం చేయబోతున్నారనే వివరాలన్ని తెలుసుకుంటున్నారు. ఏ మాత్రం తేడా సమాధానాలు వచ్చినా వారిని గేటు బయటకు నూకేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది దాదాపు 50 లక్షలకు పైగా భారతీయులపై(Indians) ప్రభావం చూపించనుంది. ఇప్పటికే అమెరికాలో ఉన్నవాళ్లు, కొత్తగా వెళ్లాలనుకుంటున్న వాళ్లకు కూడా తిప్పలు తప్పేలా లేవు.
భారత్-అమెరికా మధ్యలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయంపై ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.
Read Also :
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!
- మొగుడిని వేసేసి మామూలు పర్ఫార్మెన్స్ కాదు
- స్విగ్గీలో ఇంత మోసమా..?
- ఇజ్జత్ పోతంది.. ఏం పీ*తున్రు.?

