Nikki bhati : నాన్నే అమ్మకు నిప్పు పెట్టాడు..! చిన్నోడి సాక్ష్యం

nikki bhati killed by her husband

Nikki bhati : గ్రేటర్ నోయిడాలో జరిగిన నిక్కీ భాటి వరకట్న హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వరకట్నం కోసం యువతి ప్రాణాలు తీసిన ఘటన కన్నీరు పెట్టిస్తోంది.

అయితే నిక్కీ మరణించిన కొద్ది సేపట్లోనే ఆమె భర్త విపిన్ భాటికి పోలీసులు గుణపాఠం చెప్పారు.

పోలీసుల నుండి పారిపోయేందుకు నిక్కీ ప్రయత్నించాడు. దీంతో అతని కాలిపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం అతను హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు.

నిక్కీ (27) అనే యువతి కొన్నేళ్ల క్రితం విపిన్ భాటిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నుంచి వరకట్నం కోసం నిరంతరం వేధింపులు ఎదుర్కొంటూ వచ్చింది. ఆగస్టు 23 రాత్రి విపిన్, అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి నిక్కీని లైటర్‌తో కాల్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనకు ఐదేళ్ల కుమారుడు ప్రత్యక్ష సాక్ష్యమై, “నాన్న అమ్మను నిప్పుతో కాల్చేశాడు” అని పోలీసులకు తెలిపాడు.

నిక్కీ మృతిచెందిన కొద్ది గంటలకే, భర్త విపిన్ భాటి Instagramలో పోస్టులు పెడుతూ, తన భార్యను తాను ఎంతగానో ప్రేమించేవాడినని నమ్మించే ప్రయత్నం చేశాడు.

“ప్రపంచం నన్ను హంతకుడని పిలుస్తోంది” అంటూ భావోద్వేగ సందేశాలు పెట్టిన అతని నిజస్వరూపం సాక్ష్యాలతో బయటపడింది.

నిక్కీ, ఆమె సోదరి కంచన్ ఇద్దరూ మేకప్ ఆర్టిస్ట్‌లు. సోషల్ మీడియాలో 49,000 మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అనేక అవార్డులు కూడా గెలుచుకున్నారు.

Read Also :