Urjit patel : ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) పదవికి నియమితులయ్యారు. వాషింగ్టన్ డీసీలోని ఈ కీలక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో ఆయన మూడు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని నియామక కమిటీ ఆమోదించింది.
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్‌ల మంత్రిత్వశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘‘ఉర్జిత్ పటేల్ గారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడు సంవత్సరాలు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు’’ అని పేర్కొంది.
2016 సెప్టెంబర్ నుండి 2018 డిసెంబర్ వరకు ఉర్జిత్ పటేల్ ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా సేవలందించారు. అయితే ఆయన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేశారు. ఆ కాలంలోనే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ డైరెక్టర్‌గా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇనిస్టిట్యూట్ సలహా బోర్డులో సభ్యుడిగా వ్యవహరించారు.
బాధ్యతలు నిర్వహించారు. అంతేకాక, చైనా మద్దతుతో నడుస్తున్న ఆసియన్తన కెరీర్ ప్రారంభంలో పటేల్ ఐఎంఎఫ్‌లో ఆర్థికవేత్తగా పనిచేశారు. ఆ తరువాత ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లో 2022-24 మధ్య వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.
READ ALSO

