Delhi : ఢిల్లీ లో జరిగిన 15వ భారత-జపాన్ వార్షిక సదస్సులో రెండు దేశాలు ఒక కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని పరిశీలించే లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ (LUPEX) మిషన్‌కు పునాది పడింది.
ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై నీటి మంచు (water ice) ఉనికిని గుర్తించడం, అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి విషయాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీరు దొరకడం భవిష్యత్తులో మనుషుల నివాసానికి, అంతరిక్ష పరిశోధనలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
ఈ ప్రాజెక్టులో భారత్ నుంచి ఇస్రో (ISRO), జపాన్ నుంచి జాక్సా (JAXA) కలిసి పనిచేస్తాయి. రాకెట్ ప్రయోగం, ల్యాండర్, రోవర్ వంటి టెక్నాలజీలను ఇరు దేశాలు పంచుకుంటూ ఈ మిషన్‌ను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Read Also :

