DJ TRYPS : గాల్లో ఎగురుతూ డీజే సెట్‌..!

DJ TRYPS PARAGLIDING

DJ TRYPS : భారతీయ డీజే టీఆర్‌వైపీఎస్‌ పారాగ్లైడింగ్ చేస్తూ సంగీతం వాయించి రికార్డు సృష్టించింది. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో మ్యూజిక్ పరికరాలను తీసుకెళ్లి, గాల్లో తేలుతూ లైవ్ డీజే సెట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచంలో తొలిసారిగా పారాగ్లైడింగ్ చేస్తూ డీజే ప్రదర్శన ఇచ్చిన మహిళగా ఆమె గుర్తింపు పొందింది. అయితే కొంతసేపటి తర్వాత పరికరాలు పనిచేయకపోవడంతో ప్రదర్శన ఆగిపోయిందని చెప్పింది.

Read Also :

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, “మహిళలు అనుమతి కోసం వేచి ఉండరు… చరిత్ర సృష్టిస్తారు” అని కామెంట్లు చేస్తున్నారు.