OG Trailer : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓబీ సినిమా ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై ఇప్పటికే బీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు థియేటర్ కు వెళ్దామా అని వేచి చూస్తున్నారు.
కొందరైతే లక్షల రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు. అటు ఫ్యాన్స్ తాకిడితో బుక్ మై షో వణికిపోతోంది. కామన్ పీపుల్ నుండి సెలబ్రిటీల దాకా ఓజీ ఫీవర్ లోనే ఉన్నారు.
ఇదే సమయంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో పవన్ కల్యాణ్ ను చూశాక.. ఇక ఫ్యాన్స్ కు ఊపిరి ఆడటం లేదు.
చేతిలో కత్తితో స్టేజ్ పైకి వచ్చిన ఆయన.. డైలాగ్స్ చెబుతూ అదరగొట్టారు. స్టేజ్ పైనే డైలాగ్ ఇలా ఉంటే.. ఇక థియేటర్ లో పరిస్థితి ఏంటని అంచనాలు పెరిగిపోయాయి.
అయితే.. వాస్తవానికి ఎల్బీస్టేడియంలోనే ట్రైలర్ రిలీజ్ చేయాలి. కానీ అది వీలు కాలేదు. దీంతో డైరెక్టర్ పై పవన్ కల్యాణ్ (pawan kalyan)సీరియస్ అయ్యారు.
చివరకు కాస్త ఆలస్యంగా ఇవాళ ఓజీ సినిమా ట్రైలర్ (OG Trailer)రిలీజ్ చేశారు. అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటే ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం ఎవరివల్లా అయ్యేది కాదేమో.
ఎందుకంటే యూట్యూబ్ లో చూసిన వాళ్లే చిర్రెత్తిపోతున్నారు. ఆ బీజీఎం, డైలాగ్స్.. పవన్ కల్యాణ్ పర్ఫార్మెన్స్ చూసి.. పిచ్చోళ్లైపోతున్నారు.
ట్రైలరే ఈ స్థాయిలో ఉంటే.. థియేటర్ లో పరిస్థితి ఎలా ఉంటుందోనని అంటున్నారు. సిన్మా చూశాక ఆ హైప్ తో ఎంతమంది గుండెలు ఆగిపోతాయోనని మాట్లాడుకుంటున్నారు.
మరోవైపు… ట్రైలర్ లో కొత్తదనం ఏమీ లేదని మరికొందరు అంటున్నారు. ట్రైలర్ చూస్తున్నప్పుడు.. ఆ సీన్లన్ని ఆల్రెడీ ఏదో సినిమాలో చూసినట్టుగా అనిపిస్తోందని అంటున్నారు.
ట్రైలర్ ను బట్టి చూస్తే వయలెన్స్ తప్పా మరేం లేదంటున్నారు. ఇది కూడా మరో హరిహర వీరమల్లు, పంజా కాబోతోందని మాట్లాడుకుంటున్నారు.
సోది చూడలేక థియేటర్ లో ప్రాణాలు పోతాయి కావొచ్చని అంటున్నారు. అందుకే థియేటర్ బయట అంబులెన్స్ లు సిద్ధంగా పెట్టాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
యూట్యూబ్ లో ట్రైలర్ కింద కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఫ్యాన్స్ వారిపై మండిపడుతున్నారు. రోమాలు నిక్కపొడిచేలా ఉన్న ట్రైలర్ గురించి అలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
..
Read Also :

