Google:గూగుల్‌ AdX అమ్మాలంటూ ప్రభుత్వ డిమాండ్‌

Google:అమెరికాలో గూగుల్‌పై మరో కీలక కేసు ప్రారంభం కానుంది. వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో సోమవారం నుంచి విచారణ మొదలవుతోంది. గూగుల్ తన ఆన్‌లైన్‌ అడ్వర్టైజింగ్ వ్యాపారం లోని ఒక భాగాన్ని అమ్మే పరిస్థితి రాకుండా కాపాడుకోవడమే దీని ప్రధాన లక్ష్యం.

యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ (DOJ) మరియు కొన్ని రాష్ట్రాలు కలిసి గూగుల్‌ తన AdX అనే అడ్వర్టైజింగ్ ఎక్స్చేంజ్‌ను విక్రయించాలని కోరుతున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లో వెబ్‌సైట్లు ప్రకటనలు అమ్మేటప్పుడు గూగుల్‌కు 20% ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం ప్రకారం, ఈ సిస్టమ్ గూగుల్‌కు అక్రమ మోనోపలి శక్తి కల్పిస్తోంది. అదనంగా, యాక్షన్‌లో ఎవరు గెలుస్తారో నిర్ణయించే మెకానిజాన్ని ఓపెన్ సోర్స్ చేయాలని కూడా కోరుతున్నారు.

జడ్జి లియోనీ బ్రింకేమా ఇప్పటికే ఏప్రిల్‌లో గూగుల్ వెబ్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీలో మోనోపలి కలిగి ఉందని తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఆమెే గూగుల్‌కు ఏ శిక్షలు విధించాలో నిర్ణయించనున్నారు.

గూగుల్ మాత్రం ఈ కేసులో DOJ ప్రతిపాదనలు సాంకేతికంగా సాధ్యం కాదని వాదిస్తోంది. ప్రకటనదారులు, ప్రచురణకర్తలకు గందరగోళం వస్తుందని చెబుతోంది. గతంలో యూరప్‌లో ఇలాంటి కేసు సమయంలో గూగుల్ AdX అమ్మడానికి అంగీకరించిందని రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అమ్మకం కాకుండా, తన విధానాలు మార్చి ఇతర పోటీ ప్లాట్‌ఫారమ్‌లను వాడుకునే అవకాశం ఇస్తామని చెబుతోంది.

ఈ కేసులో న్యూస్ కార్ప్, డైలీమెల్, అడ్వాన్స్ లోకల్‌ లాంటి మీడియా సంస్థల ప్రతినిధులు సాక్ష్యం ఇవ్వనున్నారు. DOJ ప్రకారం, గూగుల్ తన పబ్లిషర్ అడ్వర్టైజింగ్ సర్వర్ను AdXతో బలవంతంగా కలిపి వెబ్‌సైట్లను తన సిస్టమ్‌లోనే బంధించింది. దీంతో గూగుల్ తన ప్రకటనదారులకు మొదటి, చివరి బిడ్ అవకాశం ఇచ్చింది. ఇది ప్రచురణకర్తల ప్రయోజనాలకు విరుద్ధం అని కోర్టు భావిస్తోంది.

నాలుగు ఏళ్లలో పోటీ పెరగకపోతే, గూగుల్ తన పబ్లిషర్ సర్వర్‌ను కూడా అమ్మాలని ప్రభుత్వం కోర్టులో అభ్యర్థించింది

Read Also : 

.