Aarogyasri : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్టు నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. ఇప్పటికే కాలేజీలు బంద్ పాటించడంతో సర్కారు వారిని పిలిచి చర్చలు జరిపింది. రూ.600 కోట్లు ఇస్తామని ప్రకటించింది.
అయితే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కూడా బంద్ ప్రకటించడంతో వారికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్ట వెల్లడించింది. అయినా వారు వెనక్కి తగ్గలేదు. మొత్తం రూ.1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని.. వాటిని ఇచ్చేవరకు ఊరుకునేది లేదని హెచ్చరించాయి.
Read Also : లవంగం తింటే తంబాకు అన్నరు:బండి సంజయ్
ఆరోగ్యశ్రీ కింద.. ఆరోగ్యశ్రీ లబ్దిదారులతో పాటు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, జర్నలిస్ట్ హెల్త్ స్కీం పలు హాస్పిటల్స్ సేవలు అందిస్తున్నాయి.
రూ.1,100 కోట్ల బకాయిలు చెల్లించాలని జనవరిలో నెట్ వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. రెండు నెలల్లో సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సేవలను పునరుద్ధరించింది.
ప్రతి నెలా రూ.200 కోట్లు ఇస్తామని చెప్పిన సర్కారు.. ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో నేటి నుండి మళ్లీ సేవలు బంద్ చేయబోతున్నారు.
అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. కానీ బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు పదే పదే నిలిచిపోతున్నాయి.
Read Also :

