BIG BREAKING : సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల తేదీలు ఇవే

BREAKING NEWS-09-BATUKAMMA.COM

BIG BREAKING : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నోటిఫికేషన్ ను కమిషన్ విడుదల చేసింది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది.

మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.

మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తర్వాత అక్టోబర్ 30, నవంబర్ 4, అలాగే నవంబర్ 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అందేలా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

అది తప్పుల తడకగా ఉందని.. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే సీఎస్ కు ఫిర్యాదు చేశారు.

అయితే..  42 శాతం రిజర్వేషన్లపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు వాదనలు విన్నది.

రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఎలక్షన్లు నిర్వహించవద్దని తెలిపింది. అక్టోబర్ 6న మరోసారి విచారిస్తామని చెప్పింది. కానీ ఈ లోపే నోటిఫికేషన్ రిలీజైంది.

Read Also :