Rajaiah : బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత విషయం ఓ కొలిక్కి వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీటెక్కాయి.
సవాళ్లు, ప్రతిసవాళ్లతో నాయకులు మాటల హోరు పెంచారు. బైఎలక్షన్ పక్కా అని భావిస్తున్న స్టేషన్ ఘన్ పూర్ లో(Station ghanpur) పరిస్థితి మరింత హీటెక్కింది.
మాజీ ఎమ్మెల్యే రాజయ్య(Rajaiah), ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి (kadiyam srihari)మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.
Read Also : మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం..!
Read Also : ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?
తాజాగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తీవ్రమైన పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు.
“అరేయ్ కడియం.. మొగోడివైతే రాజీనామా చెయ్..!!”
“సిగ్గు శరం ఉంటే..వరంగల్ పౌరుషం ఉంటే రాజీనామా చెయ్..!!”
కడియం శ్రీహరిపై .. మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు..
మొగోడివైతే రాజీనామా చెయ్…
కాంగ్రెస్ కార్తకర్తలు ఉమ్మేస్తున్నా అదే పార్టీలో ఉంటున్నావ్..
అంటూ తీవ్ర ఆగ్రహం… pic.twitter.com/N6BOzFBjZt— PV NEWS (@pvnewstelugu) September 13, 2025
అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు రాజయ్య. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కడియం శ్రీహరి మొహంపై ఉమ్మేస్తున్నారన్నారు. అయినా సిగ్గులేకుండా అదే పార్టీలో, పదవిలో ఎలా కొనసాగుతున్నావంటూ ఆయన ప్రశ్నించారు.
కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో పాటు.. తన కూతురిని (Kadiyam kavya)కాంగ్రెస్ నుండి లోక్ సభకు పోటీ చేయించారు. స్వయంగా ఎన్నికల ప్రచారం చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పక్కా అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాజయ్య ఇలా సీరియస్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Read Also :
- బర్రెలా ఉన్నావంటూ అనసూయపై తిట్ల వర్షం..!
- ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?
- ఏ బీర్ తాగితే మంచిదంటే.?
- బీఆర్ఎస్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.!

