Corona Vaccine : ప్రాణాలు తీస్తున్న కరోనా వ్యాక్సిన్..!

corona vaccine causing severe deaths experts concern

దేశవ్యాప్తంగా ఆకస్మిక మరణాల వెనుక కరోనా వ్యాక్సిన్‌ (Corona Vaccine)ప్రభావం ఉందనే అంశంపై కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.

యూనివర్సల్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ డా. అమితవ్‌ బెనర్జీ (amitav benerjee)ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం, కరోనా మహమ్మారిని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం, ఫార్మా కంపెనీలు (pharma companies) కలిసిపని చేసి ప్రజల ప్రాణాలతో భయంకరమైన ప్రయోగం చేశాయని ఆరోపించారు.

టీకా పరీక్షలు పూర్తి కాకముందే ప్రజలపై ప్రయోగం…

కరోనా టీకాల పనితీరును పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే అత్యవసర పరిస్థితి పేరిట ప్రజలకు ఇచ్చారని అన్నారు. ఈ తొందరపాటు నిర్ణయమే ఇప్పటికీ అనేక సమస్యలకు కారణమవుతోందని అభిప్రాయపడ్డారు.

“టీకా వేసిన తర్వాత గుండెపోటులు(Heart attack), రక్తం గడ్డకట్టడం (త్రాంబోసిస్‌)(thrombosis), ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం (త్రాంబోసైటోపీనియా), ముఖానికి పక్షవాతం, వివిధ రకాల క్యాన్సర్లు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ టీకా దుష్ప్రభావాల ఫలితమే” అని ఆయన వివరించారు.

టీకా లేని దేశాల్లో తక్కువ మరణాలు…

డా. బెనర్జీ ప్రకారం, టీకా వేయని దేశాల్లో ఇలాంటి మరణాలు నమోదవడం లేదు. “ఆఫ్రికా దేశాల్లో, పలు ద్వీప ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉంది. అక్కడ పోస్టు-కరోనా మరణాలు చాలా తక్కువ. కానీ భారత్‌లో మాత్రం రోజురోజుకీ ఆకస్మిక మరణాలు పెరుగుతుండటం ఆందోళనకరం” అని ఆయన స్పష్టం చేశారు.

experts concern over corona vaccine causing severe deaths

ప్రభుత్వాల నిర్లక్ష్యం?

సమావేశంలో పాల్గొన్న ఇతర వక్తలు కూడా ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా చిన్నపిల్లలు, ఆరోగ్యవంతమైన యువకులు కూడా గుండెపోటుతో మరణించడం గమనార్హమని తెలిపారు.

“ఇలాంటి మరణాలకు జీవన విధాన మార్పులే కారణమని చెప్పడం ఆశ్చర్యకరం. అసలు కారణాలను తెలుసుకోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి పరిశోధనలు చేయకపోవడం వెనుక ఏదైనా రహస్యముందా?” అని వారు ప్రశ్నించారు.

వక్తల అభిప్రాయం ప్రకారం, కారణాలను అన్వేషిస్తే ఫార్మా కంపెనీలు – కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగిన కరోనా వ్యాక్సిన్‌ ఒప్పందాలు వెలుగులోకి వస్తాయని పాలకులు భయపడుతున్నారేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది.

కోట్ల రూపాయల వ్యయం – ఫలితం ఏమిటి?

డా. బెనర్జీ మాట్లాడుతూ, కరోనా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 లక్షల కోట్లకు పైగా ప్రజా ధనం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. “అంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ప్రజల ప్రాణాలను కాపాడకపోగా, మరణాలను పెంచినట్టేనా?” అని ప్రశ్నించారు.

తెలంగాణలో ప్రత్యేక కమిటీ అవసరం…

“కనీసం తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక తరహాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆకస్మిక మరణాలపై సమగ్ర పరిశోధన జరపాలి. ప్రజల ఆరోగ్యం, భద్రత కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఇలాంటి మరణాలను అడ్డుకోవడానికి శాస్త్రీయ దృష్టితో చర్యలు తీసుకోవాలి” అని వక్తలు డిమాండ్‌ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ అంశాన్ని పట్టించుకోకపోతే, రాబోయే రోజుల్లో మరిన్ని అమూల్యమైన ప్రాణాలు బలి కావాల్సిన పరిస్థితి దాపురిస్తుందని వారు హెచ్చరించారు.

Read Also :