Nepal : నేపాల్ లో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. లక్షలాదిగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ను తగలబెట్టారు. ప్రభుత్వ అనుకూల మీడియా హౌజ్ లకు నిప్పు పెట్టారు.
మంత్రులు, మాజీ మంత్రులను ఉరికించి ఉరికించి కొడుతున్నారు. ఒక మంత్రి పారిపోయే ప్రయత్నంలో నదిలోకి దిగారు. అయినా కూడా వదలకుండా ఆయనపై దాడి చేశారు.

మరోవైపు.. నేపాల్ మాజీ ప్రధాని జాలనాథ్ ఖనల్ భార్య రాజ్యలక్ష్మిని నిరసనకారులు చంపేశారు. నిప్పు పెట్టడంతో ఆమె ప్రాణాలు వదిలారని తెలుస్తోంది.
🚨FLASH: Former Nepal PM Jhalnath Khanal’s wife, Ravi Laxmi, has passed away following an attack on their home by protesters.
pic.twitter.com/yCe5TRON7r— Bharat Observers (@BharatObservers) September 9, 2025
ఇప్పటికే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. కాసేపట్లో కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉంది. మరో వైపు.. ప్రధానమంత్రి సహా పలువురు దేశం నుండి పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు.
……………………………..
Read Also :

