Gangotri : ప్రేమ పెళ్లి.. దసరా రోజు రాత్రి యువతికి ఉరి..!

karimnagar women suicides after 6 days of love marriage

Gangotri : కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. ఎన్నో ఆశలతో, ఊహలతో పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి వారం తిరగకుండానే ప్రాణాలు తీసుకుంది.

తనకు నచ్చినవాడిని చేసుకున్నాననే ఆనందం.. వందేళ్లు కలిసి కాపురం చేయాలనే ఆశలని వేసిన ఏడు అడుగులు.. ఆరు రోజుల్లోనే అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో ఈ ఘటన జరిగింది.

ఎర్దండి ఒడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి (22).. అదే కాలనీలో ఉండే సంతోష్ ప్రేమించుకున్నారు. చాలా కాలంగా ఇద్దరు ప్రేమలో మునిగితేలారు.

Read Also :

పెద్దలను కూడా ఒప్పించారు. సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. ఇక అంతా సంతోషాలే అని అనుకున్నారు. ఈ క్రమంలోనే వారం రోజులు గడిచిపోయాయి.

ఈ లోపు దసరా పండుగ వచ్చింది. గంగోత్రి(Gangotri), సంతోష్.. ఇద్దరూ గంగోత్రి పుట్టింటికి వెళ్లారు. అక్కడ అంతా కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది.

ఆ తర్వాత అంతా సర్దుకుంది. భోజనం పూర్తిచేసుకుని ఇద్దరు సంతోష్ ఇంటికి వెళ్లిపోయారు. నిద్రకు ఉపక్రమించారు.

అర్థరాత్రి దాటిన తర్వాత సంతోష్ లేచిచూస్తే పక్కన  గంగోత్రి లేదు. ఎటువెళ్లిందని చూడగా..  ఇంట్లోనే  ఉరివేసుకుని విగత జీవిగా వేలాడుతూ  కనిపించింది. ఒక్కసారిగా షాకైన  సంతోష్ కుటుంబసభ్యులను, చుట్టుపక్కల వారిని పిలుచుకొచ్చాడు.

gangotri

వారు వచ్చి చూస్తే.. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అయితే.. దసరా రోజు.. పుట్టింట్లో భర్తతో జరిగిన గొడవతో పాటు.. అత్తింట్లో కూడా గొడవ జరిగిందని అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నారు.

ఆ గొడవతో మనస్తాపం చెంది గంగోత్రి ప్రాణాలు తీసుకుందని ఆమె తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also :