BIG BREKING : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ(Medigadda), అన్నారం(Annaram), సుందిళ్ల(Sundilla) బ్యారేజీలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ప్రకటన చేశారు. మూడు బ్యారేజీల నిర్మాణంపై సీబీఐ(CBI) విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు.
అయితే పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh) రిపోర్ట్ ఆధారంగా ఎంక్వైరీకి ఆదేశించినట్టు మొదట చెప్పారు. కానీ.. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి సర్కారు సీబీఐకి లేఖ రాసింది.
ఆ తర్వాత రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు.
దీంతో ఎట్టకేలకు సీబీఐ విచారణ మొదలైనట్టు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలోని అంశాలపై సీబీఐ విచారిస్తున్నట్టు సమాచారం. లేఖలో ఏయే అంశాలున్నాయనే దానితో పాటు.. ఇతర అంశాలపైనా సీబీఐ అధికారులు ఎంక్వైరీ మొదలుపెట్టారు.
అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ మాత్రం ఫైల్ చేయలేదు.
ప్రాథమిక విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది.
దీనికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram project)అవకతవకలు జరిగాయని.. దానికి ఎంక్వైరీ చేయాలని రేవంత్ రెడ్డి (Revanthreddy)సర్కారు సీబీఐకి లేఖ రాసింది.
వారు లేఖ రాసిన తర్వాత కూడా పది రోజుల వరకు సీబీఐ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి కాబట్టే ఎంక్వైరీ ముందుకు కదలడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది.
కానీ ఈ గ్యాప్ లో రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు ఢిల్లీ టూర్ వెళ్లి వచ్చారు. కేంద్ర మంత్రులను కలిశారు. అయితే.. ఢిల్లీలో ఉన్న సమయంలోనే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీబీఐపై ఒత్తిడి చేయించి విచారణను మొదలుపెట్టించినట్టుగా సమాచారం.
ఇప్పటికే మంథనిలో జరిగిన న్యాయవాదుల హత్యపై సీబీఐ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఇటీవలే హత్య జరిగిన ప్రాంతాన్ని సందర్శించింది.
Read Also :

