Swami chaitanyananda : ఢిల్లీలో ఒక సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌కు డైరెక్టర్‌గా ఉన్న స్వామి చైతన్యానంద సరస్వతి (పార్థసారథి అలియాస్) అనే స్వయం ప్రకటిత బాబాపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
ఇందులో EWS స్కాలర్‌షిప్‌తో చదువుతున్న 17మంది పీజీ స్టూడెంట్స్ చైతన్యానందపై ఆరోపణలు చేశారు. బాబా విద్యార్థినులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడం, అక్రమంగా తాకడం వంటి వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
“నా గదిలోకి రా, నేను నిన్ను విదేశాలకు ట్రిప్‌కు తీసుకెళ్తాను, నువ్వు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు” అని బాబా చాట్ చేశాడని పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా తన కోరికలకు ఒప్పుకోకపోతే, వారిని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని విద్యార్థినులను స్వామి చైతన్యానంద (Swami chaitanyananda) అతను బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాబాతో పాటుగా ఆశ్రమంలోని కొంతమంది మహిళా సిబ్బంది, వార్డెన్లు కూడా బాబా డిమాండ్లకు లొంగమని తమపై ఒత్తిడి తెచ్చారని విద్యార్థినులు ఆరోపించారు. బాధితులు కేసు నమోదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత బాబా పరారీలో ఉన్నాడు.

మొత్తం 30 మందికి పైగా అమ్మాయిల స్టేట్ మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అందులో వారు సంచలన విషయాలు వెల్లడించారు. సాక్ష్యాలు కూడా చూపించారు.
తమతో దారుణమైన బూతు పదాలు వాడుతూ మెస్సేజ్ లు పంపించాడని వివరించారు.
అతని చివరి లొకేషన్‌ను ఆగ్రా సమీపంలో గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు. బాబాపై లైంగిక వేధింపుల కేసులు రావడం ఇదే మొదటిసారి కాదు. 2009లో మోసం, వేధింపుల కేసు నమోదవ్వగా, 2016లో కూడా ఇలాంటి కేసు నమోదైంది.
పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతని కారుకు నకిలీ డిప్లొమాటిక్ నెంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించారు, ఇది కూడా దర్యాప్తులో భాగం. ఈ కేసు విద్యార్థులను ఆశ్రయించే సంస్థల్లో భద్రత మరియు జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలను పెంచుతోంది.
Read Also :

