Singareni : సింగరేణి కార్మికులకు సంస్థ వాటాల్లో సర్కారు బోనస్ ప్రకటించింది. సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బోనస్ ప్రకటించారు.
సింగరేణి మొత్తం ఆదాయం రూ.6394 కోట్లు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy)చెప్పారు. ఇందులో రూ.4034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించామన్నారు. మిగిలిన రూ.2300 కోట్ల నుండి కార్మికులకు 34 శాతం వాటా ఇస్తున్నట్టు ప్రకటించారు.
34 శాతం వాటా కింద రూ.819 కోట్ల రూపాయలు కార్మికులకు(Singareni) బోనస్ కోసం కేటాయించినట్టు తెలిపారు.
అలాగే కాంట్రాక్టు కార్మికులకు గతేడాది రూ.5000 బోనస్ ఇచ్చామన్నారు. ఇప్పుడు రూ.5500 బోనస్ ఇస్తామని తెలిపారు. దీపావళికి కూడా కార్మికులకు బోనస్ ఇస్తామని చెప్పారు.
సింగరేణి ప్రయివేటు పరం కాకుండా చూస్తామన్నారు. ప్రయివేటుకు ఇచ్చిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరాన్నారు. కేంద్రంతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తామన్నారు.
భవిష్యత్ లో కార్మికులకు అండగా ఉంటామని సీఎం చెప్పారు. సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామన్నారు.
కేంద్రం జీఎస్టీ సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని వివరించారు.
తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
..
Read Also :

